29.7 C
Hyderabad
May 2, 2024 04: 53 AM
Slider ప్రత్యేకం

పుట్టి ముంచిన విజయసాయి అత్యుత్సాహం

BJP Twits

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి అత్యుత్సాహం ఇప్పుడు పూర్తిగా పుట్టిముంచేలా తయారైంది. ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డిపై బిజెపి అత్యంత తీవ్రంగా రియాక్ట్ అవుతున్నది.

ఇప్పటి వరకూ విజయసాయి రెడ్డి ఢిల్లీ బిజెపి నేతలతో సఖ్యతగా ఉండి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన పనులను చక్కబెడుతున్నారు. అయితే అనూహ్యంగా తెరపైకి వచ్చిన కరోనా రాపిడ్ టెస్టింగ్ కిట్ల వ్యవహారంలో కన్నా లక్ష్మీ నారాయణ ట్విట్టర్ లో స్పందించడం దానికి అనవసరమైన వ్యాఖ్యలు జోడిస్తూ విజయసాయి రెడ్డి సమాధానం ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.

ఇది బిజెపి వైసీపీ మధ్య అగాధం సృష్టించింది. ఛత్తీస్ గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి వేరే సందర్భంలో మాట్లాడుతూ తాము రాపిడ్ టెస్టు కిట్లను రూ.335కు కొనుగోలు చేశామని చెప్పడంతో రాపిడ్ టెస్టు కిట్ల రేటు ఎంతో చెప్పగలరా అని కన్నా లక్ష్మీనారాయణ ఎంతో హుందాగా ట్విట్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ.730 కి కొనుగోలు చేసినట్లు అప్పటికే ప్రచారం లో ఉంది. అయితే దాన్ని అధికారికంగా ఎక్కడా ఎవరూ చెప్పలేదు. ఈ సందర్భంలో కన్నా లక్ష్మీనారాయణ ట్విట్ కు సంబంధిత అధికారి లేదా సంబంధిత మంత్రి సమాధానం చెప్పకుండా విజయసాయి రెడ్డి స్పందించారు.

స్పందించడమే కాకుండా కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబునాయుడి నుంచి రూ.20 కోట్లు తీసుకుని ఇలా పరోక్షంగా తెలుగుదేశం వాదనలు వినిపిస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. దాంతో ఒక్క సారిగా బిజెపి ఉలిక్కిపడింది. తమ పార్టీ అధ్యక్షుడి పైనే దారుణమైన వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డిని ఇక ఉపేక్షిస్తే లాభం లేదని బిజెపి అధిష్టానవర్గం కూడా భావించింది.

ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ రావడంతో రాష్ట్ర స్థాయితో బాటు జాతీయ స్థాయి బిజెపి నేతలు కూడా విజయసాయి రెడ్డి చేసిన దారుణమైన వ్యాఖ్య పట్ల అభ్యంతరం చెబుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తీసేసేందుకు రూపొందించిన ఆర్డినెన్సు పైన కన్నా లక్ష్మీనారాయణ తక్షణమే స్పందించి అభ్యంతరం చెప్పినా రాష్ట్ర గవర్నర్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సంతకం పెట్టడంపైన ఇప్పటికే రాష్ట్ర బిజెపి నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

కేంద్రంలోని బిజెపి వైసీపీకి సహకరించుకుంటూ పోతే క్షేత్ర స్థాయిలో పోరాటం చేయడం తమకు కష్టమౌతుందని వారు అన్నారు. ఆ వివాదం అలా ఉండగానే ఇప్పుడు రాపిడ్ టెస్టు కిట్ల వ్యవహారం వచ్చింది. రాష్ట్ర స్థాయి నాయకులను తిడుతూ కేంద్ర స్థాయి నాయకులతో మంచిగా ఉంటే ఎన్ని తప్పులు చేసినా ఫర్వాలేదా అంటూ ఇప్పుడు రాష్ట్ర బిజెపి ప్రశ్నిస్తున్నది. దాంతో బిజెపి జాతీయ నాయకత్వం క్లియర్ కట్ పాలసీని చెప్పేసినట్లు తెలిసింది. ఈ క్లియర్ కట్ పాలసీ ప్రకారం విజయసాయి రెడ్డికి రాబోయే రోజుల్లో ఢిల్లీలో పనులు కావడం అంత సులభం కాదని అంటున్నారు.

Related posts

Update: వై ఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం

Bhavani

ఎట్రాషియస్: మైనర్ బాలికపై ముగ్గురి దుర్మార్గం

Satyam NEWS

సిబ్బంది కుటుంబాలకు బాసటగా పోలీసు భద్రత స్కీమ్

Satyam NEWS

Leave a Comment