29.7 C
Hyderabad
May 2, 2024 06: 58 AM
Slider సంపాదకీయం

విశాఖ శారదా పీఠం రాజకీయ వ్యాఖ్యలు ఎందుకోసం?

#VisakhaSaradaPeetham

హైకోర్టు తీర్పుతో స్వామివారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని భావించిన విశాఖ శారదా పీఠం ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ప్రెస్ నోట్ విడుదల చేయడంలో ఎలాంటి తప్పు లేదు. వివరణ ఇవ్వడంలో కూడా తప్పులేదు. అయితే ఒక రాజకీయ పార్టీ లాగా ప్రెస్ నోట్ లోని అంశాలు ఉండటమే ఇప్పుడు చర్చనీయాంశం.

విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని 23 ప్రముఖ దేవాలయాల అర్చకులు, ముఖ్య కార్యనిర్వహణాధికారులు స్వరూపానందేంద్ర కు ఆశీస్సులు అందచేయాలని, ఆలయ లాంఛనాలు తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ ఉత్తర్వులను ఎందుకు ఇచ్చారూ అంటే అంతకు ముందు శారదా పీఠం వారు ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తూ స్వామి వారి పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాటు చేయాలని కోరడంతో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎంతో అండగా నిలిచే స్వామివారి కోరికకు అనుగుణంగా ఆదేశాలు వెలువడ్డాయి.

దీనిపై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు కాగా రాష్ట్ర హైకోర్టు కేసు విచారణ కు స్వీకరించగానే శారదా పీఠం తరపున కోర్టుకు హాజరైన అడ్వకేట్ తాము రాసిన లేఖను ఉప సంహరించుకుంటున్నామని కోర్టుకు చెప్పారు. దాంతో ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. ఇదీ జరిగింది.

ఇందులో దాచి పెట్టేందుకు ఏమీ లేదు. అయితే శారదా పీఠం తన ప్రెస్ నోట్ లో ఏం చెప్పిందో తెలుసా? ‘‘గత మూడు రోజులుగా మహా స్వామి వారి జన్మ దినోత్సవంపై అసత్య ప్రచారం, అనవసర రాద్ధాంతం జరుగుతోంది’’ అని అంటున్నారు. జరిగిన విషయాల్లో అసత్యం ప్రచారం ఏమిటి?

శారదా పీఠం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం కరెక్టు కాదా? రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం కరెక్టు కాదా? న్యాయ స్థానంలో తాము ఆ లేఖను ఉప సంహరించుకుంటున్నట్లు శారదా పీఠం చెప్పడం కరెక్టు కదా? రాష్ట్ర హైకోర్టు కొట్టేయడం కరెక్టు కాదా? 23 దేవాలయాల వారు ఆలయ మర్యాదలతో వెళ్లి స్వామి వారిని ఆశీర్వదించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే వాటిని ప్రశ్నించకూడదా?

‘‘మహాస్వామి వారికి భగవంతుని ఆశీస్సులు ఉండాలన్న ఏకైక ఉద్దేశ్యంతో జన్మదిన మహోత్సవం రోజున ఆలయ మర్యాదలు కోరాం’’ అని ప్రెస్ నోట్ లో చెబుతున్నారు. అదే కదా మీడియా రాసింది, మరి అనవసర రాద్ధాంతం ఏమిటి? భగవంతుడి ఆశీస్సులు కావాల్సిన వారు భగవంతుడి దగ్గరకు వెళతారు తప్ప భగవంతుడిని తమ వద్దకు రప్పించుకోరు. హైకోర్టు తీర్పును శిరసావహించి మౌనంగా ఉండాల్సిన శారదా పీఠం రాజకీయ ప్రెస్ నోట్ లు విడుదల చేయడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఇలాంటి చర్యల కారణంగా శారదా పీఠం పై అప్పటి వరకూ నమ్మకం ఉన్న వారికి కూడా సడలి పోతుంది.

Related posts

సంక్షేమ రంగానికి 47వేల కోట్ల రూపాయల వ్యయం

Satyam NEWS

హనుమాన్ జయంతి యాత్రకు సంపూర్ణ సహకారం

Satyam NEWS

నిరుద్యోగ నిరసన దీక్షతో ప్రభుత్వానికి వణుకు పుట్టాలి

Satyam NEWS

Leave a Comment