Slider ఖమ్మం

నిరుద్యోగ నిరసన దీక్షతో ప్రభుత్వానికి వణుకు పుట్టాలి

#vemnarendarreddy

రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మానికి ఓ ప్రత్యేకత ఉందని కాంగ్రెస్ కు ఖమ్మం కంచుకోట అని మాజీ శాసనసభ్యులు వేం నరేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, మహమ్మద్ జావేద్ లు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఎన్నో ఏండ్లుగా నిరుద్యోగ యువత స్టడి రూమ్ ల చుట్టూ తిరుగుతూ కుటుంబాలని వదిలి రేయింబవళ్ళు కష్ట పడి చదువుతుంటే ప్రభుత్వం వారి పట్ల కనికరం లేకుండా ఉద్యోగాలను అమ్మే ప్రయత్నం చేసిందని అన్నారు. నిందితులను పట్టుకోవడంలో కూడా ప్రభుత్వం అంతా సీరియస్ గా ప్రయత్నం చేయలేదని పేపర్ లు కొన్న వాళ్లే బయటకి వచ్చి మేమే పేపర్ లు కొన్నామని చెప్పారు తప్పా ప్రభుత్వ చేసిందేమీ లేదన్నారు.

కేసీఆర్ మన నీళ్ళు మన నిధులు, మన నియామకాలు అంటూ మా నీళ్ళు, మా నిధులు, మా నియామకాలు అనే స్థాయికి చేరుకున్నారని అందులో భాగంగానే నేడు ఉద్యోగాలు అమ్ముకుంటూన్నారని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క ఆధ్యర్యంలో నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని అన్నారు. ఈ నెల 24న ఖమ్మం పట్టణంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నిరసన ర్యాలీ తో రాష్ట్ర ప్రభుత్వ వెన్నుల్లో వణుకు పుట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొనున్నట్టు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Related posts

నీటి వ‌న‌రుల వినియోగంపై అఖిల ప‌క్షం ఏర్పాటు చేయాలి

Satyam NEWS

హీరోలు వచ్చారు వీరతాళ్లు వేయండి

Satyam NEWS

గుజరాత్ తుది పోరు!: ఎవరి ఆశ వారిదే

Bhavani

Leave a Comment