పట్వారీ గిరీలు తీసివేసిన తర్వాత కరణం నియోగ బ్రాహ్మణ వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని, ఊర్లలో ఉండలేక పరువు మర్యాదలు కోసం పట్నాణాల్లో అజ్ఞాత జీవితం గడువుతున్నాని వరంగల్ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం నాయకుడు జేవీఎల్ నరసింహరావు అన్నారు.
చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాల్లో సతమతమవుతూ జీవనం వెళ్లదీస్తున్నాని, ఓటు బ్యాంకు లేకపోవడం వల్ల పార్టీలు కూడా ఖాతరు చేయడం లేదని ఆయన అన్నారు. ఆర్థిక అంగబలాలు సమకూర్చుకోవాలంటే ఐక్యత తో ఉండాలని ఆయన అన్నారు. కరణం తెలివి మమూలుది కాదు అని చాటి చెప్పే సమయం ఆసన్నమైందని, ఇలాంటి దశలో గత మూడేళ్ళుగా బండారు రాం ప్రసాద్ రావు చేస్తున్న కృషికి అందరూ కలిసి రావాలని ఆయన అన్నారు.
మొదట్లో మనకెందుకు లే అన్న కుటుంబాల్లో ఇప్పుడు చైతన్యం వచ్చిందని, బండారు రాం ప్రసాద్ రావు పెట్టిన సభలకు వందలాదిగా తరలి వస్తున్నారని నరసింహారావు పేర్కొన్నారు. ఇప్పుడు వరంగల్ లో నిర్వహించబోతున్న సభను విజయవంతం చేసి కరణాల పౌరుషాన్ని పార్టీల నాయకులకు చూపించాలని ఆయన పిలుపునిచ్చారు.
అందరూ కలసికట్టుగా కదిలితే చాణక్య నీతితో పేదరికం పోతుందని ఆయన అన్నారు. మన వారు కట్టిన దేవాలయాల్లో మన వారసులకే పాలక మండలిలో స్థానం కల్పించాలని, వచ్చే కొత్త రెవెన్యూ వ్యవస్థలో కరణం పిల్లలకు సముచిత స్థానం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
బ్రాహ్మణ సొసైటీ స్థానములో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ రెండు లక్షలు 5 లక్షలు కాకుండా కొత్త ఇండస్ట్రీ కి 50 లక్షలు ఇవ్వాలని ఆయన కోరారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని ఓసీ అన్న నెపం తో కరణాలకు వర్తింపజేయలేక పోతున్నారని ఆ వ్యత్యాసం పోవాలని ఆయన డిమాండ్ చేశారు.
చట్ట సభల్లో, కార్పొరేషన్ లలో పంచాయితీలలో నామినేటెడ్ పోస్ట్ లలో కరణాలకు అన్ని పార్టీలు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.
(జేవీఎల్ నరసింహారావు, రిటైర్డ్ మేనేజర్ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, ప్రశాంత్ నగర్ రాంపల్లి చౌరస్తా నాగారం ఈ సి ఐ ఎల్ సికింద్రాబాద్. స్వస్థలం జాలిగామ గజ్వెల్ మండలం సిద్దిపేట జిల్లా)