29.7 C
Hyderabad
May 2, 2024 05: 08 AM
Slider విశాఖపట్నం

విశాఖ పోర్టు ట్రస్టులో కరోనా నియంత్రణ చర్యలు

#Vizag Port Trust

కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ అదేశాల అనుసారం విశాఖపట్నం పోర్టు ట్రస్టులో కోవిడ్ 19 నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయని విశాఖపట్నం పోర్టు ట్రస్టు చైర్మన్ రామమోహనరావు వెల్లడించారు. కేంద్రం నుంచి తదుపరి ఆదేశాలు అందే వరకూ ఈ చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

విశాఖపట్నం పోర్టు స్టేడియంలో క్వారంటైన్ సెంటరన్ ను , పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ లో ఐసోలేషన్ వార్డును10 బెడ్ ల సామర్ధ్యంతో ఏర్పాటుచేసినట్లు ఆయన వెల్లడించారు. కోవిడ్ 19 నివారణకు తీసుకోవలసిన చర్యలపై పోర్టులోని అన్ని విభాగాల ఉద్యోగులకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారు.

షిఫ్టుల్లో ఉద్యోగులు వచ్చేలా ఏర్పాట్లు

కేంద్రనౌకాయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల మేరకు 33 శాతం మంది ఉద్యోగులు వారానికి ఒక మారు చొప్పున షిఫ్టు విధానంలో అనుమతిస్తున్నట్లు, ఆపరేషనల్ ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

పోర్టులో పని చేసే ఉద్యోగుల మధ్య 1 నుంచి2 మీటర్ల కనీస భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇంటి నుంచి పోర్టుకు వచ్చే సమయంలో పోర్టులో విధులు నిర్వహించే సమయంలో అలాగే తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఉద్యోగులు తప్పని సరిగా మాస్కులు ధరించాలి. తరచుగా చేతులు కడుక్కునే విధంగా ఉద్యోగులకు సూచనలు చేశారు.

కరచాలనం పూర్తిగా నిషేధం

కార్యాలయంలో గ్రూపులుగా సంచరించడం ఇతరులను అనవసరంగా కలవడం వంటి అంశాలకు దూరంగా ఉండాలి. జ్వరం, జలుబు,దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పోర్టు హాస్పిటల్ కు సమాచారం అందించాలి.

అందుబాటులో వ్యక్తిగత రక్షణ సామాగ్రి

పోర్టులో వివిధ ప్రదేశాలలో పని చేసే వారికి అవసరమైన రక్షణ పరికరాలు పూర్తిగా ఉందుబాటులో ఉన్నాయి. పోర్టులో పని చేసే సిబ్బందికి ఫేస్ మాస్కులు, సర్జికల్ మాస్కులు, ఎన్ 95 మాస్క్ లు, గూగుల్స్, హెడ్ కాప్స్, హ్యాండ్ గ్లౌవ్స్, ఫుట్ కవర్స్, సబ్బులు,హ్యాండ్ శానిటైజర్స్ లను అందజేశారు.

పోర్టు పరిధిలో ఉన్న అన్ని ప్రధాన భవంతులలో ఉన్న  కార్యాలయ గదులు, టాయిలెట్స్, కారిడార్స్, మెట్లు లాంటి ప్రదేశాలను నిత్యం ఫినాయిల్ తో  పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. షిప్ లలో విధులకు వెళ్లే వారు షిప్ లలో విధులు ముగించుకుని వచ్చే వారి కోసం పోర్టు స్టేడియంలో 20 బెడ్లతో కూడిన క్వారంటైన్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.

ఇప్పటివరకూ ఇక్కడ 22 మంది సిబ్బందికి  క్వారంటైన్ లో ఉంచగా వారందరికీ కరోనా నెగటివ్ రిపోర్టు వచ్చింది. 10  బెడ్ల సామర్ధ్యంతో కూడిన ఐసోలేషన్ వార్డునుపోర్టు గోల్డెన్  జూబ్లీ హాస్పిటల్ లో ఏర్పాటు చేశారు.

Related posts

26 వరకూ రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

Satyam NEWS

అవనితల్లికి అభివందనం!

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్క‌లు నాటిన‌ హీరోయిన్

Sub Editor

Leave a Comment