39.2 C
Hyderabad
May 3, 2024 12: 50 PM
Slider నల్గొండ

కలెక్టరేట్ ముందు వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలు

#VRA

రెవిన్యూ శాఖలో గ్రామీణ ప్రాంతాల్లో వెట్టి చాకిరి చేస్తున్న వీఆర్ఏల పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారి పోతుందని, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ 22 నెలలు అవుతున్నా అమలుకు నోచుకోలేదని  వీఆర్ఏ జాక్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

బుధవారం తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపిస్తూ వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జాక్ నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి ప్రకంటించిన విధంగా పే స్కేల్ ఇవ్వాలని, అర్హత కల్గిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని,55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తూ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, ప్రభుత్వ సహాయ నిరాకరణకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు షేక్.మహమ్మద్ రఫి, రాష్ట్ర వీఆర్ఏ జాక్ కో కన్వీనర్,లచ్చుమళ్ళ నరసింహారావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొబ్బి నర్సయ్య, జిల్లా జాక్ చైర్మన్ ఏ.నాగమల్లేష్, జిల్లా సెక్రటరీ జనరల్ ఎం. సైదులు,జిల్లా జాక్ కో చైర్మన్ జి.మధుసూదన్ రావు,జిల్లా జాక్ కన్వీనర్ బి.మల్లయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని వెంకట్,కో కన్వీనర్లు యూసఫ్ ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టుల ప్రదర్శన

Bhavani

కరోనా యాంటీ బాడీలతో పుట్టిన సింగపూర్ బిడ్డ

Satyam NEWS

ప్రజా సమస్యల పరిష్కార వేదికగా స్పందన కార్యక్రమం

Bhavani

Leave a Comment