Slider నల్గొండ

పెరిగిన నిత్యావసర వస్తువులకు అనుగుణంగా కార్మికులను ఆదుకోవాలి

#hujurnagar

నేడు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఫ్లాట్ ఫామ్ రిక్షా,ట్రాలీ ఆటో కార్మికుల ఎగుమతి దిగుమతి రేట్లు పెంచాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి యాజమాన్యాన్ని కోరారు.

స్థానిక వర్తక సంఘం భవనంలో కిరాణా షాపు యాజమాన్యం,కార్మికులు జాయింట్ చర్చలు గురువారం రాత్రి 12 గంటల వరకు చర్చలు జరిగి వాయిదా పడ్డాయని తెలిపారు. నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినందున కార్మికుల జీవన పరిస్థితులకు అనేక ఇబ్బందులు ఉన్నందున యాజమాన్యం తక్షణమే స్పందించాలని రోషపతి కోరారు. గతంలో అగ్రిమెంటు రెండు సంవత్సరాలు పూర్తయి తిరిగి అగ్రిమెంట్ చేసుకొనుటకు కార్మికులు ప్రస్తుతం ఉన్న రెట్లపై 60 శాతం పెంచాలని కార్మికులు కోరగా యాజమాన్యం 15 శాతం పెంచుతామని అన్నారని,రాత్రి వరకు సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఒక కొలికి రాకపోవడంతో ఈనెల 15వ,తేదీన సోమవారం నాటికి వాయిదా పడ్డాయని రోషపతి తెలిపారు.

ఈ జాయింట్ చర్చలలో యాజమాన్యం తరఫున ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్ష్య, కార్యదర్శులు ఉప్పల రమేష్,మైలవరం నాగేశ్వరరావు,రేపాల వెంకటేశ్వర్లు,భూపతి గౌరయ్య,అంజి,శ్రీను,సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యుడు యల్క సోమయ్య గౌడ్,ప్లాట్ ఫారం రిక్షా,ట్రాలీ ఆటో యూనియన్ అధ్యక్ష్య,కార్యదర్శులు పంగ సైదులు,పిట్టల రమణయ్య రామిరెడ్డి, ఉదయభాస్కర్,నరసింహారావు, చింతకాయల నాగరాజు,బుడిగ అప్పారావు,వాసు,గోపి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

జగన్ కు రాజకీయ భవిష్యత్తు లేదు

Satyam NEWS

ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలో ప్రత్యేక పూజలు

Satyam NEWS

కువైట్ యన్టీఆర్ సేవాసమితి వరుస అన్న వితరణ

Satyam NEWS

Leave a Comment