25.2 C
Hyderabad
May 8, 2024 08: 18 AM
Slider ఆధ్యాత్మికం

ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలో ప్రత్యేక పూజలు

#bhadrachalam

ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఏప్రిల్‌ 10న శ్రీరామనవమిని పురస్కరించుకొని నేటి నుంచి సంప్రదాయబద్ధంగా ఆలయ అధికారులు నవమి ఉత్సవాల పనులను ప్రారంభించారు. ప్రధాన ఆలయంలోని మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

అనంతరం ఆలయంలోని చిత్రకూట మండపంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం స్థానాచార్యులు స్థల సాయి నేతృత్వంలో రోలు, రోకలికి దేవతలను ఆవాహన చేసి పసుపు దంచే వేడుకను వైభవంగా చేపట్టారు. అలా తయారు చేసిన పసుపుతో తలంబ్రాలను సిద్ధం చేశారు. ఆలయంలోని బేడా మండపం వద్ద లక్ష్మణ సమేత సీతారాములకు డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. ఏప్రిల్‌ 9న సీతారాములకు ఎదుర్కోలు ఉత్సవం, 10న కల్యాణోత్సవం, 11న పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి.  రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్త బృందాలు విశేష సంఖ్యలో తరలివచ్చి గోటి తలంబ్రాలను అందించి మొక్కులు తీర్చుకున్నారు.

Related posts

దివాకర్ ట్రావెల్స్ మూతపడే వరకూ వదలరేమో

Satyam NEWS

బాబామెట్ట హజరత్ ఖాదర్ వలీ బాబా వారి ఆశ్ర‌మంలో ఎమ్మెల్యే కోలగట్ల

Satyam NEWS

మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి

Satyam NEWS

Leave a Comment