తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య సన్మాన కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తూ ప్రచురించిన వాల్ పోస్టర్ ను నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్ డా చదలవాడ అరవింద బాబు ఆవిష్కరించారు.
ఈ నెల 16వ తేదీన గుంటూరులోని వెంకటేశ్వర జ్ఞాన మందిరంలో వర్ల రామయ్య సన్మాన సభ నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ సభలో విశేసంగా పాల్గొని విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాచదలవాడ అరవింద్ బాబు తోబాటు మాజీ రాష్ట్ర గ్రంధాలయ శాఖ చైర్మన్ దాసరి రాజా మాస్టర్ కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జగదీష్, కొల్లి బ్రహ్మయ్య, పులిమి రామిరెడ్డి, రాయప్ప, కొమ్ముల నాగేశ్వరరావు,దావల నాగేశ్వరరావు,సురేష్ తదితరులు కూడా హాజరయ్యారు.