40.2 C
Hyderabad
May 2, 2024 15: 35 PM
Slider మహబూబ్ నగర్

వసూలు రాజాలపై చర్యలు: వనపర్తి ఎమ్మెల్యే

#megareddy

వనపర్తి నియోజకవర్గ పరిధిలోని కొంతమంది వ్యక్తులు తన పేరు వాడుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చెప్పారు. వసూలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని అయన తెలిపారు.రైస్ మిల్లులు, ఇసుక క్వారీలవద్ద,వివిధ రకాలవ్యాపారాలు చేసుకునే వ్యాపారుల దగ్గర, మద్యం దుకాణాల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నట్లు  అభియోగాలు ఉన్నాయని చెప్పారు.

ఎవరైనా  ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తే  నేరుగా  సెల్ ఫోన్ నెంబర్ 9494216666కు ఫిర్యాదు చేయాలని అయన ప్రజలను కోరారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెసేజ్ కూడా చేయవచ్చని, గోప్యంగా పెడతామన్నారు.

మానాజీపేట కాంగ్రెస్ నేత అక్రమంగా జేసీబీ, వాహనాలు పెట్టి ఇసుక తరలిస్తుంటే పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలిస్తే దాని మీద విచారణ చేయాలని చెప్పకుండా  పోలీస్ స్టేషన్ కు వెళ్లి వాహనాలను విడిపించుకుని పోయారని వనపర్తి మునిసిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ చెప్పారు. 

మోజెర్లలోని ఒక రైసుమిల్లులోకి కాంగ్రెస్ నేత ప్రవేశించి అందులో తప్పులు జరిగాయని అక్కడే ఆయనే తీర్పు చెప్పారని, సివిల్ సప్లై బియ్యం విషయంలో  వత్తిళ్లకు తలొగ్గి అక్రమ కేసులు చేయలేక జిల్లా స్థాయి అధికారి సెలవులో వెళ్లారని తెలిపారు. తప్పు చేసిన వారి మీద ఫిర్యాదు చేయమని  ఎమ్మెల్యే  పెట్టిన మెసేజ్ కొంతమందికి మింగుడు పడటం లేదని అఖిలపక్షం ఐక్య వేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ చెప్పారు.

జిల్లాలో  గతంలో అక్రమాలకు, అవినీతికి  పాల్పడ్డ వారికి భయం చుట్టుకున్నదని తెలిపారు. మెసేజ్ పెట్టినందుకు కొంతమంది ప్రతిపక్ష నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.  తప్పు చేసిన వారు భయపడాలని చెప్పారు.

 గతంలో ఎవరెవరు ఏం చేసిండ్రు అందరికీ తెలుసని, వనపర్తి ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన గుణపాఠం చెప్పిన  ఇంకా బుద్ధి రాలేదని అయన విమర్శించారు. ఏ పొరపాటు జరిగిన ఎవర్ని వదిలిపెట్టేది లేదని తెలిపారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

ఇక్కడే తెలుగు బోధించకపోతే మరెక్కడ చెబుతారు?

Satyam NEWS

న్యూ లీడర్: పులివెందుల బాధ్యతలు బీటెక్ రవికి

Satyam NEWS

ఫ్రీ వైరస్:బెంగాల్ లో పేదలకు ఉచిత విద్యుత్

Satyam NEWS

Leave a Comment