40.2 C
Hyderabad
April 29, 2024 16: 06 PM
Slider నెల్లూరు

నెల్లూరు జిల్లాలో కాకరేగుతున్న రాజకీయాలు

#anam

నెల్లూరు రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. అదే విధంగా జిల్లా రాజకీయాల్లో ఆసక్తి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా సీఎం సామాజిక వర్గ నేతలే ప్రత్యర్థులుగా మారగా తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ చేస్తున్న విమర్శలు అధికార పార్టీకి మరింత ఇబ్బంది కరంగా మారాయి. అనిల్ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు అర్బన్ నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇప్పటికే నుడా చైర్మన్ ముక్కాల ద్వారకా, బాబాయ్ రూప్ కుమార్ అనిల్ కు పూర్తిగా దూరం అయ్యారు. ఇదిలా వుంటే తాజాగా వైసీపీ రెబల్ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం నారాయణ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఆయనకే ఎదురు తగలనున్నాయి. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఆనం టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. ఇదే సమయంలో ఆనం లక్ష్యంగా అనిల్ మాటల తూటాలు పేల్చుతున్నారు. దమ్ముంటే తన పైన పోటీ చేసి గెలవాలని సవాల్ చేస్తున్నారు. తన రాజకీయం నెల్లూరులో ఆరంభమైందని, నెల్లూరులోనే ముగింపు కావాలనుకుంటున్నానంటూ ఆనం అసలు విషయం తేల్చేసారు.

తాను గతంలో నెల్లూరు, రాపూరు, ఆత్మకూరు, వెంకటగిరి ల నుంచి పోటీ చేశానని ఆనం గుర్తు చేసారు. ఆరు సారు ఎమ్మెల్యేగా గెలిచానని, కొన్నిసార్లు ఓడిపోయాని చెప్పారు. చంద్రబాబు ఆదేశిస్తే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయమన్నా అందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసారు. చంద్రబాబు ఒకవేళ పది నియోజకవర్గాల గెలుపు బాధ్యతను అప్పగిస్తే ఆ పని చేస్తానని వెల్లడించారు.

1983 లో టిడిపి నుంచి నెల్లూరు నుంచి పోటీ చేసి గెలిచానని గుర్తు చేసిన ఆనం రాజకీయాల నుంచి విరమించుకునే ముందు నెల్లూరు నుంచి పోటీ చేయాలని నేను భావిస్తున్నానని చెప్పారు. తన రాజకీయ జీవితం మొదలైన నెల్లూరులోనే ముగింపు ఉండాలని కోరుకుంటున్నానని చెప్పటం ద్వారా పరోక్షంగా నెల్లూరు నుంచి పోటీకి సిద్దమనే సంకేతాలు ఇచ్చారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి నారాయణ నెల్లూరు సిటీ నుంచి పోటీకి సిద్దమవుతున్నట్లు తొలుత భావించారు. అనారోగ్య కారణాలతో నారాయణ పోటీ చేయటం లేదని..ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు సిటీ నుంచి బరిలోకి దిగే ఛాన్స్ ఉందనే వాదన వినిపిస్తోంది. అదే జరిగితే అనిల్ వర్సస్ ఆనం పోటీ రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Related posts

డేంజర్ బెల్స్: దేశంలోకి వచ్చేసిన కరోనా వైరెస్

Satyam NEWS

Tragedy: గంట వ్యవధిలోనే భార్య భర్త మృతి

Satyam NEWS

విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఉత్తర్వులు

Satyam NEWS

Leave a Comment