31.2 C
Hyderabad
May 3, 2024 01: 57 AM
Slider మహబూబ్ నగర్

ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి

#waterharvesting

ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టుకొని భూమిలో ఇంకెవిధంగా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూగర్భ జల వనరులు, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, సిబ్బందితో జల సంరక్షణ పై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వర్షా కాలంలో పడే ప్రతి వర్షపు నీరు ను వృధా పోనీయకుండా ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు తవ్వించి నీరు వాటిలో ఇంకెవిధంగా చూడాల్సిన బాధ్యత అధికారులు సిబ్బంది పై ఉందన్నారు. 

దీని కోసం జాతీయ  ఉపాధి హామీ ద్వారా నిధులు సైతం మంజూరు చేయడం జరుగుతుందన్నారు.  అదేవిధంగా కమ్యూనిటీ ఇంకుడు గుంతలు ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.  ప్రజలకు అవగాహన కల్పించి వసరిని ప్రోత్సహించడం వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుందని తెలియజేసారు.  ఏ ఏ గ్రామంలో ఎంతశాతం ఇంకుడు గుంతలు పూర్తి చేశారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

ఈ రోజు  అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతలు పూర్తి చేసిన కొడుపర్తి, బావాజీపల్లి, అప్పాజీపల్లి గ్రామ పంచాయతీల  పంచాయతీ కార్యదర్శులకు ,  టెక్నీకల్ అసిస్టెంట్ లకు   అడిషనల్ కలెక్టర్  సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ నర్సింగ్ రావు, అడిషనల్ డి ఆర్ డి ఓ రాజేశ్వరి, ఎంపీడీఓలు ,ఏపిఓలు తదితరులు  పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

అక్షరాభ్యాసానికి వెళుతూ ఆసుపత్రి పాలైన పిల్లలు

Satyam NEWS

పోలీస్, మునిసిపల్ అధికారులపై క్రిమినల్ కేసు

Satyam NEWS

వనపర్తి జిల్లాలోవ్యాక్సినేషన్ పూర్తి చేయాలి

Satyam NEWS

Leave a Comment