38.2 C
Hyderabad
April 28, 2024 19: 26 PM
Slider ముఖ్యంశాలు

గెలుపు ఓటమి లని నిర్ణయించేది మేమే

#kunamaneni

బీజేపీ చేతిలో దేశంలోని న్యాయ వ్యవస్థ బంధీ అయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని ఆరోపించారు. ఖమ్మం లోని సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ గుజరాత్లో 98 మందిని ఊచకూత కోసిన నిర్దుషులుగా విడుదల చేశారని ఇప్పుడు 11 మంది సజీవ దహనానికి సంబంధించి గుజరాతో కోర్టు విడుదల చేసిన సందర్భంలో వీరిని ఎవరు చంపారన్న న్యాయవాది ప్రశ్నకు సమాధానం చెప్పలేనిస్థితి నెలకొన్నదన్నారు.

కేంద్ర హెూo శాఖ మంత్రి పలు నేరాలలో సంబంధమున్న అమిత్ షా న్యాయస్థానానికి వచ్చి సాక్షిగా చెప్పడాన్ని కూనంనేని తప్పుపట్టారు. గుజరాత్మాడల్ పాలన అంటే ఏమిటో అనుకున్నామని కాని రాజ్యాంగ వ్యవస్థలను గుప్పెట్లోపెట్టుకోవడం అని ఇప్పు రుజువైందన్నారు. బిల్కిస్ భాను కేసులో ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించారని ఇంతకంటే బీజేపీ న్యాయ వ్యవస్థను ప్రభావితంచేస్తుందనడానికి మరో ఉదహారణ లేదన్నారు. న్యాయ వ్యవస్థకు రాజకీయ జార్ఖం అత్యంత ప్రమాదకరమని సాంబశివరావు. తెలిపారు.

బీజేపీ పక్కన నిలిస్తే తప్పు చేసినా పర్వాలేదన్నట్లు వ్యవహరిస్తున్నారని, రాజసింగ్ శ్రీరామునితోపాటు గాడ్సే బొమ్మను పక్కనపట్టి ఊరేగింపు చేసినా చర్యలు తీసుకోకపోవడం బీజేపీ తీరును తెలియజేస్తున్నదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్న బీజేపీని ఓడించక పోతే దేశ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందన్నారు. అనేక త్యాగాలతో నిర్మితమైన విశాఖ ఉక్కును కారు చౌకగా మోడీకి కట్టబెట్టాల నిబంధనలు రూపొందించారని ఆయన ఆరోపించారు. లక్షల కోట్ల విలువ చేసే ఉక్కు కర్మాగారాన్ని కారుచౌకగా కట్టబెడుతున్నారని అంబానీ ఆదానిల అనుకూల నిబందనలు. రూపొందిస్తున్నారని బీజేపీ హయాంలో రాజకీయ అవినీతి పెరిగి పోతుందన్నారు.

బీజేని ప్రశ్నించే వారిని, బీజేపీ వ్యతిరేక బావ జాలం ఉన్నవారిని వేధింపులకు ఉరిచేస్తున్నారని సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. గ్లోబుల్ అవార్డు గ్రహీత అమర్తసేనుక్కు హక్కు పత్రాలందించిన ఆయనను ఖాళీ చేయాలంటూ హుళం జారీ చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగిఉందన్నారు. బీజేపీ ప్రశ్నిస్తే వేధింపులు తప్పడం లేదని సాంబశివరావు తెలిపారు. రాజకీయాలలో ధన ప్రభావం పెరిగిపోయిందని అడ్డదిడ్డంగా సంపాదించిన కొంతమంది డబ్బులతో రాజకీయాలను శాసించాలని ప్రయత్నం చేస్తున్నారని సాంబశివరావు తెలిపారు.

రూపాయి ఖర్చులేకుండా మీరు ఎక్కడైనా గెలువగలరా అని ప్రశ్నించారు. అసెంబ్లీగేటు తాకనివ్వకపోవడం. ఎవరి చేతిలో లేదని ప్రజా విశ్వాసం ఉంటే అది నెరవేరుతుందని కమ్యూనిస్టులుగా ఖమ్మం జిల్లా. నుంచి ఈ దఫా అసెంబ్లీలో అడుగుపెడతామని కూనంనేని స్పష్టం చేశారు. ధనబలం కంటే జనబలం ప్రధానమని ఆయన అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజల పక్షాన నిలబడి కొట్లాడ గలిగేది కమ్యూనిస్టులు మాత్రమేనన్నారు. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు ఐక్యమై గెలుపు ఓటములను శాసించబోతున్నారని గతంలో అదే జరిగిందని సాంబశివరావు తెలిపారు.

రాష్ట్రంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి నామపక్షాలు త్వరలో ముఖ్యమంత్రికి లేఖ వ్రాయనున్నాయని సాంబశివరావు తెలిపారు. అర్హులైన గిరిజన, గిరజేతరులకు పాడు పట్టాలు, పంచాయతీ. కార్యదర్శులు రెగ్యులైజేషన్ సహా పలు సమస్యలపై లేఖ వ్రాస్తామని సకాలంలో పరిష్కరించక పొతే సమస్యల పరిష్కారానికి ఆందోళన చేపడుతామని సాంబశివరావు తెలిపారు. మీడియా సమావేశంలో సి.పి.ఐ జిల్లా కార్యదర్శి పాటు ప్రసాద్, రాష్ట్ర సమితి సభ్యులు యార్రబాబు, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, జిల్లా కార్యవర్గసభ్యులు రావి శివరామకృష్ణ పాల్గొన్నారు.

Related posts

Breaking News: ఏపిలో హిందూమతంపై దాడికి కేంద్ర బీజేపీ సీరియస్

Satyam NEWS

నో గాడ్:దైవదర్శనానికి వెళుతూ 5గురు మరణం

Satyam NEWS

తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు?

Satyam NEWS

Leave a Comment