37.2 C
Hyderabad
May 2, 2024 12: 45 PM
Slider నెల్లూరు

నిరుపేదల ఆకలి విలువను తెలిపేవి రంజాన్ ఉపవాసాలు

#adala

నిరుపేదల ఆకలి విలువను తెలిపేందుకే రంజాన్ ఉపవాసాలని నెల్లూరు ఎంపీ,రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు . నెల్లూరు లోని పిచ్చి రెడ్డి కళ్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం తన సొంత నిధులతో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదిమంది ఆకలితో ఉన్నవారికి సహాయం చేయాలనేదే దీని అసలు ఉద్దేశం అని అభిప్రాయపడ్డారు. ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులకు రంజాన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్ష విరమించిన తర్వాత ముస్లిం సోదరులు తమ విందును ఆరగించి వెళ్ళాలని విజ్ఞప్తి చేశారు.

 ఈ కార్యక్రమంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి, కార్పొరేటర్లు రియాజ్, అవినాష్, మొఇళ్ల గౌరీ, అశోక్, మూలే విజయభాస్కర్ రెడ్డి, బొబ్బల శ్రీనివాస యాదవ్, మూలే విజయ భాస్కర్ రెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, వైసీపీ నేతలు స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి, పెంచల్ రెడ్డి, చేజర్ల సుబ్బారెడ్డి, హరిబాబు యాదవ్, పాశం శ్రీనివాసులు, యేసు నాయుడు, మేఘనాథ్ సింగ్, సురేష్ రెడ్డి, ఆర్ఎస్ ఆర్, సుధాకర్ యాదవ్, బట్టే నరేంద్ర రెడ్డి, సునీల్ రెడ్డి, దారా వంశీ, పెంచల్ రెడ్డి, మైనార్టీ నేతలు సయ్యద్ అబ్దుల్ సలీం, ఇస్మాయిల్ ఖాద్రి, కంతర్వలి, సయ్యద్ ఫయాజ్ ఉద్దీన్, సమీర్ ఖాన్, అల్లాబక్షు, అబూబకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మతం గొప్పదా? మానవత్వం గొప్పదా??

Satyam NEWS

కుతుబ్ మినార్ యాజమాన్య హక్కుల వ్యాజ్యం కొట్టివేత

Satyam NEWS

పోడు పట్టలకు రైతు బందు

Bhavani

Leave a Comment