38.2 C
Hyderabad
May 3, 2024 22: 57 PM
Slider గుంటూరు

మాది పక్షపాత పేదల ప్రభుత్వం: డాక్టర్ గోపిరెడ్డి

#gopireddy

మాది పేదల పక్షపాత ప్రభుత్వం అని గుంటూరు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. నరసరావుపేట పట్టణంలోని చిలకలూరిపేట రోడ్డులో గల టిడ్కో ఇళ్ల జియో ట్యాగింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీ టిడ్కో ఇళ్ల కింద 1,503 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. టిడ్కో ఇళ్లు కట్టిన ప్రాంతంలో 90 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన 10 శాతం పనులైన రోడ్డు, డ్రైనేజ్ పైప్ లైన్ పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. లాటరీ ప్రకారం ఇళ్లు కేటాయించిన వారికి జియో ట్యాగింగ్ ద్వారా వివరాలు నమోదు చేస్తున్నామని తెలిపారు.

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 70 శాతం మంది ఇప్పటికే ఇళ్లు కట్టుకోవడం ప్రారంభించి స్లాబ్ లు వేసే వరకు వచ్చిందని తెలిపారు. బ్యాంక్ ల ద్వారా ఎప్పటికప్పుడు ప్రోత్సాహకం అందిస్తూ లోన్ ల నగదును అకౌంట్లలో వేయడం జరుగుతుందన్నారు. ఉప్పలపాడు వద్ద ఇసుక రీచ్ ను ఏర్పాటు చేసిన గుర్తు చేశారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతమయ్యేలా 15 నుంచి  20 రోజుల్లో విధివిధానాలు రూపొందించి పూర్తి వివరాలు తెలియజేస్తామని స్పష్టం చేశారు. జగన్ గారు పేదల సంకేమానికి పెద్ద పీట వేసి అందరికి ఇళ్లు కట్టిస్తున్నారని తెలిపారు. ఇది పేదల పక్షపాత ప్రభుత్వమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Related posts

నిర్మల్ పట్టణంలో తడి పొడి చెత్త ఇక సపరేటు

Satyam NEWS

రాజధానుల బిల్లు న్యాయస్థానాలలో నిలబడదు

Satyam NEWS

శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణోత్సవాలు ప్రారంభం .

Bhavani

Leave a Comment