29.7 C
Hyderabad
May 2, 2024 06: 16 AM
Slider మహబూబ్ నగర్

65 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి 9 సంవత్సరాల్లో చేశాం

#ktr

గత ప్రభుత్వాలు 65 సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేవలం 9 సంవత్సరాల్లో చేశామని రాష్ట్ర ఐ.టి. శాఖ మంత్రి కే. తారక రామారావు అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా పర్యటనలో పాల్గొని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తో కలిసి 669.67కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపన లు చేశారు. అనంతరం వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ముఖ్య అతిథిగా మాట్లాడారు. 

ఒకప్పుడు పాలమూరు జిల్లా అంటే కరువు, వలసల జిల్లా అని, బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకొని బొంబాయిలో అవస్థలు పడుతుంటే అప్పటి ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. రెండు నదులు తుంగభద్ర, కృష్ణ నదులు పాలమూరు జిల్లా నుండి బిరబిరా పారుతుంటే ఒక్క ఎకరానికి సాగు నీరు ఇవ్వకుండా రాయలసీమ, ఆంధ్రకు తరలించుకు పోయారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క పాలమూరు జిల్లాలో నే 1.25 లక్షల ఎకరాలకు నది జలాలు సాగునీరు గా పారుతుందన్నారు.

ఈరోజు పాలమూరు జిల్లా అంటే ఇరిగేషన్ జిల్లాగా మారిపోయింది అన్నారు . వనపర్తి జిల్లాలో మెడికల్, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పడ్డాయని, విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.  జిల్లాలో మాత శిశు సంరక్షణ కేంద్రం, 3250 డబుల్ బెడ్రూం ఇళ్లు, 10300 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మంజూరు అయ్యాయని తెలిపారు. రైతు భీమా కింద 1405మందికి 70కోట్ల రూపాయలు రైతుల నామిని ల అకౌంట్ లో జమ చేయడం జరిగిందని అభివృద్ధి సంక్షేమ పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ముందే దసరా పండుగ వచ్చేసినట్లు పండగ వాతావరణం కనిపిస్తుందని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అభివృద్ధిలో వనపర్తి జిల్లాను సిరిసిల్ల సిద్దిపేట తో పోటీ పడతానని మంత్రి చెప్పారు ఈరోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వనపర్తి జిల్లాలో రూ. 22 కోట్ల నిధులు ఐటీ టవర్ నిర్మాణానికి మంజూరు చేస్తూ ఉత్తర్వు కాపీని నా చేతికి అందించడం జరిగింది అన్నారు. అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

రాష్ట్రం వచ్చేదాకా వనపర్తి జిల్లాలో ఒక ఎకరాకు కృష్ణమ్మ సాగునీరు పారలేదని తెలంగాణ వచ్చాక తన కృషితో జిల్లాలో 70 వేల ఎకరాలకు నేడు సాగునీరు అందుతుందన్నారు. జిల్లాలో కేవలం కాసిం నగర్ కు మాత్రమే సాగునీరు అందడం లేదని రాబోయే రోజుల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి అయ్యాక వనపర్తి జిల్లాలోని కృష్ణమ్మ నీళ్లు అందని ఒక్క గ్రామము లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో వివిధ కళాశాలలో మెడికల్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ నర్సింగ్ లాంటి కళాశాలలో జిల్లాలు నెలకొల్పడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో వనపర్తి కి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మరిన్ని తీసుకువచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ స్వాగతోపన్యాసం ఇస్తూ వనపర్తి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నందుకు జిల్లా కలెక్టర్ గ ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు వనపర్తి జిల్లాలో 669.67కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపన లు మంత్రుల చేతుల మీదుగా జరిగాయని  తెలిపారు. జిల్లాకు ఐ.టి. హబ్ మంజూరు చసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధికి మరిత సహాయ సహకారాలు అందించాలని కోరారు.

అంతకు ముందు ఉదయం నుండి రాష్ట్ర ఐటి, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖ మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తో కలిసి వనపర్తి జిల్లాలో రూ. 669.67 కోట్ల విలువ గల 24 పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మొదటగా సంకిరెడ్డిపల్లి కొత్తకోట దగ్గర ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేశారు. బుగ్గ పల్లి తండా పెద్దమందడి వద్ద 425.00 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ 75 యం.ఎల్.డి సామర్థ్యం  కలిగిన డబ్ల్యూటీ మోటారు కు స్విచ్ వేసి ప్రారంభోత్సవం  చేశారు.

రాజపేట వద్ద 5.08 కోట్లతో 4 బ్లాకుల్లో  నిర్మించిన 96 రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చి లబ్దిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ కాపీలు  పంపిణీ చేశారు.  అనంతరం 0.75 కోట్లతో నిర్మించిన టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పక్కన నాగవరం శివారులో ప్రొఫెసర్ జయశంకర్ రాక్ గార్డెన్, రూ. 2.80 కోట్లతో నిర్మించిన ఉర్దూ ఘార్, శాదిఖాన భవనం, 1.25 కోట్ల వ్యయంతో నిర్మించిన డైనింగ్ హాల్ మరియు అనుబంధ భవనాని ప్రారంభోత్సవం చేశారు.1.02 కోట్లతో నిర్మించిన భూసార పరీక్షల ప్రయోగా శాల, 2.75 కోట్లతో నిర్మించబడే బి ఎస్సీ అగ్రికల్చర్ కళాశాల, ఐ.టి హాబ్ కు శంకుస్థాపన చేశారు.  0.50 కోట్లతో నిర్మించిన జంతు సంరక్షణ యూనిట్ ను ప్రారంభించారు.

రూ.22కోట్లతో  వనపర్తి జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కృష్ణ దేవరాయ పాలిటెక్నిక్ కళాశాల పునర్నిర్మాణం, బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణానికి   శంఖుస్థాపన చేశారు.  కోటి రూపాయలతో నిర్మింపబడిన సురవరం ప్రతాపరెడ్డి జిల్లా గ్రంథాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు.  2.00 కోట్ల రూపాయలతో నిర్మింపబడే ప్రభుత్వ జూనియర్ కళాశాల కు శంఖుస్థాపన చేశారు.  పీర్ల గుట్ట దగ్గర  రూ.15.50 కోట్ల రూపాయలతో నిర్మించబడిన 294  రెండు పడక గదుల  ఇండ్లను రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవం చేశారు. 

రు. 5.75 కోట్లతో నూతనంగా నిర్మించబడిన సురవరం సాహితీ కళాభవనం, రూ. 20 కోట్లతో నిర్మించిన నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాలను ప్రారంభోత్సవం చేసారు. 48.50 కోట్లతో వనపర్తి నుండి పెబ్బేరు కు పోయే బీటీ రోడ్డు, 73 కోట్ల అంచనా వ్యయంతో బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. రూ. 15 కోట్ల అంచనా వ్యయం తో వనపర్తి మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు, డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు.  కోటి రూపాయలతో నిర్మించిన  సెగ్రికేషన్ షెడ్, రూ. 25.52 కోట్ల వ్యయంతో   బాలుర, బాలికల కొరకై JNTU హాస్టల్ భవనము నకు శంఖుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు, మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు ఆలా వేంకటేశ్వర రెడ్డి, అలంపూర్ శాసన సభ్యులు అబ్రహం,    జడ్పీ చైర్మన్ ఆర్. లోక్నాథ్ రెడ్డి, అదనపు కలెక్టర్ యస్. తిరుపతి రావు, జడ్పి వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మాజీ ఎంపి మంద జగన్నాథం, గద్వాల డి.సి.సి.బి డైరెక్టర్ గట్టు తిమ్మప్ప, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్,  గిడ్డంగుల శాఖ చైర్మన్ రజిని, గిరిజన కార్పొరేషన్ ఛైర్మన్ వాల్య నాయక్,  ఎంపిపి లు, జడ్పీటీసీ లు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

మావోయిస్టు ప్రాంతాల్లో పర్యటించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ

Satyam NEWS

ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు మావోయిస్టులు హతం

Satyam NEWS

ప్లీజ్ ఫాలో: కరోనా వ్యాప్తి నిరోధానికి జనతా కర్ఫ్యూ పరిష్కారం

Satyam NEWS

Leave a Comment