తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ మ్.రవీంద్రనాథ్ బాబు చింతూరు, రంపచోడవరం పోలీస్ సబ్ డివిజన్ల ఏజెన్సీ ప్రాంత పోలీస్ స్టేషన్లు మరియు మావోయిస్టు ప్రభావిత గ్రామాలలో ఆకస్మిక పర్యటించారు
ఎస్పీ తన పర్యటనలో రంపచోడవరం ఏ ఎస్ పి కృష్ణకాంత్ పాటెల్ తో వారి కార్యాలయం లో సమావేశమై, సర్కిల్ ఇన్స్పెక్టర్లు మరియు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్లు తో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో అనుసరిస్తున్న వ్యూహాలు, గిరిజన మరియు పోలీసు మధ్య సహృద్భావ సంబంధాలపై చర్చించారు. ఏజెన్సీ ప్రాంతాలనుండి మైదాన ప్రాంతాలకు అక్రమంగా తరలివస్తున్న గంజాయి స్మగ్లింగ్ ను హరి కట్టవలసిందిగా సబ్ డివిజన్ పోలీసు అధికారులను ఎస్పి ఆదేశించారు. నాటు సారాయి తయారీ, విక్రయాలపై కూడా ఉపేక్షించకుండా చట్టపరంగా దాడులు చేసి కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా చూడాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ భద్రత కు సంబంధించి పలు సూచనలు చేశారు
అనంతరం ఎస్పీ చింతూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ లో భద్రతా పరంగా తీసుకోవలసిన చర్యలను సమీక్షించారు.పోలీస్ సిబ్బంది యొక్క గృహ సముదాయాలను కూడా పరిశీలించి సిబ్బందికి సరి అయిన నిర్వహణ నిమిత్తం సూచనలు చేశారు. ఏడుగుర్రాళ్ళపల్లి ఆర్మ్డ్ రిజర్వ్ ఔట్ పోస్టును కూడా ఎస్పీ సందర్శించి భద్రతాపరంగా తీసుకోవలసిన చర్యలను చింతూరు ఏఎస్పీ కృష్ణ కాంత్ పాటెల్ తో, సి ఆర్ పి ఎఫ్ బలగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు
ఎటపాక మండలం గుత్తికోయ గ్రామం అయిన చిపిలివాగు గ్రామాన్ని తన పర్యటనలో భాగంగా ఎస్పీ సందర్శించి చత్తీస్గడ్ రాష్ట్రం నుండి వలస వచ్చిన 36 కుటుంబాల గుత్తికోయ ప్రజల ను కలిపి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 36 కుటుంబాలకు హౌస్ హోల్డ వస్తువులైన బియ్యం,కూరగాయలు, దుస్తులు,గొడుగు,బకెట్, తదితర నిత్యవసర సరుకులను అందించి అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వారికి జరిగిన వైద్య పరీక్షలను పర్యవేక్షించారు.
స్థానిక పోలీసు అధికారులను ఈ 36 కుటుంబాల ప్రజలకు అండగా ఉండి, వారికి కనీస అవసరాలు అయినా విద్య,వైద్యం నకు ఆసరాగా నిలబడాలని సూచించారు. ఎస్పీ ఏజెన్సీ ప్రాంతాల ఈ పర్యటనలో అడిషనల్ ఎస్పి అడ్మిన్ కె.కుమార్, రంపచోడవరం ఏ ఎస్ పి కృష్ణ కాంత్ పాటెల్,చింతూరు ఏ ఎస్ పి కృష్ణ కాంత్, రెండు డివిజన్లలోని సర్కిల్ స్టేషన్ అధికారులు పాల్గొన్నారు.