31.7 C
Hyderabad
May 2, 2024 07: 58 AM
Slider ముఖ్యంశాలు

ఇరిగేషన్ కు పర్యాయపదంగా కేసీఆర్ పాలన

#ministerktr

వనపర్తి జిల్లా ఒకప్పుడు పాలమూరు జిల్లా అంటే లేబర్ జిల్లాగా పేరుబడిందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇరిగేషన్ కు పర్యాయపదం గా మారిపోయిందని తెలంగాణ రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రి వనపర్తి జిల్లా పర్యటన సందర్భంగా  వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని సంకిరెడ్డిపల్లి గ్రామంలో  ప్రియునిక్ ఆయిల్ ఫ్యాక్టరీకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్, దేవరకద్ర శాసన సభ్యుడు ఆల  వేంకటేశ్వర రెడ్డి తో కలిసి  శంఖుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఐ.టి. శాఖ మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు కృష్ణానది పాలమూరు గుండా ప్రవహిస్తూ పాలమూరుకు మాత్రము తాగడానికి నీరు ఉండేది కాదని అలాంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కృష్ణమనీలను ఒడిసి పట్టుకొని మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసుకోవడం జరిగిందన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామని దాదాపు మూడున్నర కోట్ల ధాన్యాన్ని ఎఫ్సికి ఇవ్వడం జరిగిందన్నారు. రైతులకు పక్షపాతి అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు పంట పెట్టుబడిగా సంవత్సరానికి 75 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమచేయడం జరుగుతుందన్నారు.

రైతులకు ఏమైనా జరిగితే 5 లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి రైతు బీమా ఇవ్వడం జరుగుతుంది. 24 గంటల విద్యుత్తు, మద్దతు ధర పై పంట కొనుగోలు చేయడం వల్ల మాత్రమే ఇంత అభివృద్ధి సాధ్యమైంది అన్నారు.  వేసవి కాలం సాగులో కొంత నూకలు అయితది అని పారాబాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వానికి అందిస్తే పారాబాయిల్డ్ రైస్ కొనము అని ఇబ్బందులు పెట్టింది. 

దేశంలో పప్పు ధాన్యాలు వంటనూనె కొరత ఎంతో ఉందన్నారు. దేశానికి 75% పప్పు ధాన్యాలు,  వంట నూనెలు బయటి దేశాల నుండి దిగుమతి చేసుకోవడం జరుగుతుందని, దీనిని గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ముందు చూపుతో రాష్ట్రంలో పామాయిల్ సాగుకు  పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని గుర్తించి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా తాను పామాయిల్ సాగు చేసి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు అని కొనియాడారు. 

ఒకప్పుడు 30వేల ఎకరాల్లో ఉన్న పామాయిల్ సాగును రాష్ట్రంలో 20లక్షలకు పై చిలుకు సాగు దిశగా దూసుకుపోతోంది అన్నారు.   ఎంతో ముందుచూపు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి పామాయిల్ పంటను ఎవరు కొంటారు అనే సంశయం లేకుండా ముందుగానే ఆయిల్ కంపెనీలతో మాట్లాడి  రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 34 పామాయిల్ ఫ్యాక్టరీ లు నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పామాయిల్ సాగు 4 సంవత్సరాల్లో పంట చేతికి వస్తుందని, ఆ లోపు రైతు నష్టపోకుండా ఎకరానికి 50918 రూపాయలు సంవత్సరానికి రైతుకు రాయితిగా అందించడం జరుగుతుంది. దీనికొరకు రూ. 2500 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. 

ఈ నాలుగు సంవత్సరాలు పంట చేతికి వచ్చే వరకు ఎదైన అంతర పంట వేసుకోవచ్చని అన్నారు. 4 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి 12000 రూపాయల ఆదాయం 35 సంవత్సరాల పాటు పెన్షన్ వచ్చినట్లు వస్తుందని తెలియజేశారు.  వ్యవసాయ శాఖ మంత్రి మీ జిల్లా వాసి అయినందున వ్యవసాయ రంగానికి సంబంధించి అన్ని రకాల సహకారం అందుతుందని అన్నారు.

దాదాపు 500కోట్ల తో ఇక్కడ ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఇక్కడి 300 మంది యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతుందని అన్నారు.  నైపుణ్య శిక్షణ అవసరం అయితే ప్రభుత్వం ద్వారానే అవసరమైన శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఫ్యాక్టరీలో నెలకొల్పడంలో స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని, ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.  దేశంలో ప్రజలకు అవసరమైన మేరకు పప్పుధాన్యాలు వెంటనే గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం పంటల మార్పిడికి శ్రీకారం చుట్టిందన్నారు. దేశానికి 22 మిలియన్ టన్నుల వంటనూనె అవసరం కాగా కేవలం 15 మిలియన్ టన్నుల ఉత్పత్తి మాత్రమే దేశంలో జరుగుతుందన్నారు . మటన్ ఉందని లక్షలాది రూపాయలు ఇతర దేశాలకు విచ్చేస్తున్నాం అన్నారు. తెలంగాణ రాష్ట్రం పామాయిల్ సాగుకు అనుకూలమని గుర్తించి రైతులకు పామాయిల్ సాగు దిశగా ప్రోత్సహిస్తుందన్నారు.

రైతులకు కేవలం పంట వేసుకో అని చెప్పడమే కాకుండా పంటను కొనే విధంగా ముందుగానే ఫ్యాక్టరీల తో మాట్లాడుకుని ఫ్యాక్టరీలు సైతం నెలకొల్పడం జరుగుతుందన్నారు. పంట పండించడం కాకుండా కొనుగోలు చేస్తామని బై బ్యాక్ గ్యారంటీ ఇస్తున్న ఏకైక పంట పామాయిల్ పంట అని నొక్కి చెప్పారు. పామాయిల్ పెంటకు కోతుల బెడద, పందుల బెడద, చీడ పురుగుల బెడద, దొంగల బెడద సైతం ఉండదని తెలియజేశారు. రాష్ట్రంలో ఒకప్పుడు 39వేల ఎకరాల సాగు ఉంటే ఇప్పుడు లక్ష ఇరవై మూడు వేల ఎకరాలు సాగు చేస్తున్నామని తెలిపారు.

ఒక ఆయిల్ పాం ఫ్యాక్టరీ ఎర్రవల్లి దగ్గర మరొకటి వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో పంట దిగుబడి వచ్చేలోపు  ఫ్యాక్టరీ  త్వరగా పూర్తి చేసేందుకు ముందుగానే మాట్లాడి ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు.  ఫ్యాక్టరీకి సరిపడేంత ముడిసరుకు పంటను అందిస్తామని తెలియజేశారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన దేవరకద్ర శాసన సభ్యులు ఆల వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాలమూరు జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని సంతోషం వ్యక్తం చేశారు ఇటీవలే 35వేల కోట్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందని దీనితో రాబోయే కాలంలో పాలమూరు జిల్లా మరింత సస్యశ్యామలం అయి అభివృద్ధిలో దేశంలోనే అన్ని రంగాల్లో మొదటిస్థానంలో ఉంటుందన్నారు.  పామాయిల్ తోటలు జిల్లాలో విస్తృతంగా సాగు చేయడం జరుగుతుందని, పంట దిగుబడి వచ్చేలోపు ఆయిల్ తీసే విధంగా నేడు ఆయిల్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసుకోవడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు, మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, జిల్లా జడ్పీ చైర్మన్ ఆర్ లోక్నాథ్ రెడ్డి, గిడ్డంగుల శాఖ చైర్మన్ రజిని, గిరిజన కార్పొరేషన్ ఛైర్మన్ వాల్య నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణ మూర్తి,కొత్తకోట గుంత మౌనిక, ఎంపిపిలు, జడ్పీటీసీలు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

శనీశ్వర స్వామికి తిల తైల అభిషేక పూజలు

Satyam NEWS

క్రీడాకారులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

Satyam NEWS

ఎగొనీ: ఎంపిక అయిన కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వరా?

Satyam NEWS

Leave a Comment