31.2 C
Hyderabad
May 2, 2024 23: 49 PM
Slider చిత్తూరు

కోవిడ్ నిబంధనలు అనుగుణంగా చేస్తాం

#tirupatisp

వినాయక చవితి పండుగను కోవిడ్ నిబంధనలకు లోబడి జరుపుకునేందుకు అనుమతివ్వాలని తిరుపతి గణేశ ఉత్సవ కమిటీ ప్రతినిధులు తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి వెంకట అప్పల నాయుడును కోరారు. తిరుపతి నగరంలోని ఇళ్లలో, అపార్ట్మెంట్లలో ప్రతిష్టించే వినాయక స్వామి విగ్రహాలను నిమజ్జనం చేయడం కోసం కుటుంబ సమేతంగా వినాయక సాగర్ కు తీసుకుని వచ్చి నిమజ్జనం చేసే సంప్రదాయం ఉందని వారు వివరించారు.

గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వినాయక సాగర్ లో స్వచ్ఛమైన నీరు తదితర మౌలిక సదుపాయాల కల్పన,భద్రత,బందోబస్తు ఏర్పాట్లు చేసి తోపులాటలు జరగకుండా ట్రాఫిక్ కు,శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా తగు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తిరుపతి నగరంలోని స్థానిక దేవాలయాల కేంద్రంగా 3 నుంచి 5 అడుగుల ఎత్తు చిన్న విగ్రహాలకు అనుమతులు ఇవ్వాలని తిరుపతిగణేశ ఉత్సవ కమిటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

Related posts

వేతనాల బిల్లును చించేసిన సర్పంచి భర్త

Satyam NEWS

అప్పుడే పండుగ‌..

Satyam NEWS

గిరిజన సేవా సమితి ములుగు జిల్లా అధ్యక్షుడిగా అశోక్ నాయక్

Satyam NEWS

Leave a Comment