39.2 C
Hyderabad
April 30, 2024 21: 06 PM
Slider ప్రత్యేకం

మోడీ ఆన్ ఫైర్: 12 రోజుల్లో పాకిస్తాన్ ను ఓడిస్తాం

narendra modi

ఇప్పటికి మూడు యుద్ధాలలో పాకిస్తాన్ ను ఓడించాం. మళ్లీ యుద్ధం జరిగితే పాకిస్తాన్ ను ఓడించడానికి 10 నుంచి 12 రోజులు సరిపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలో నేడు జరిగిన ఎన్ సి సి ర్యాలీలో పాల్గొని ఆయన కాడెట్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు. అందుకే  పాకిస్తాన్ దొంగచాటు యుద్ధాలు చేస్తూ భారత్ లో వేలాది మంది అమాయకుల ప్రాణాలను పణంగా తీసుకున్నదాని ఆయన వ్యాఖ్యానించారు.

మన పొరుగు దేశం మనకు వ్యతిరేకంగా మూడు యుద్ధాలు కోల్పోయిందని అందరికి తెలుసు, మన సాయుధ దళాలు వాటిని ఓడించడానికి 10-12 రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకోవు అని ఆయన అన్నారు. పాకిస్తాన్  కొన్ని దశాబ్దాల నుండి భారతదేశం వ్యతిరేకంగా దొంగచాటు యుద్ధాలు చేస్తున్నారని అన్నారు. ఇది వేలాది మంది పౌరులు, జవాన్లు ప్రాణాలను బలిగొంది అని అన్నారు. పాకిస్తాన్ పై అందుకే సర్జికల్ దాడులు, వైమానిక దాడులు చేస్తున్నామని వారి గడ్డపై ఉన్న ఉగ్రవాదులకు పాఠాలు నేర్పుతున్నామని  ప్రధాని అన్నారు.

19 మంది సైనికుల ప్రాణాలను బలిగొన్న ఉరీ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన 2016 సర్జికల్ స్ట్రైక్ గురించి ప్రధాని ప్రస్తావించారు. గత ఏడాది ఫిబ్రవరి 26 న పాకిస్థాన్ లోని ఖైబర్ ఫక్తూన్ ప్రావిన్స్ లోని బాలాకోట్ లో ఉన్న జైష్-ఇ-మహమ్మద్ అతిపెద్ద టెర్రరిస్టు శిబిరంపై భారత వైమానిక దళం వైమానిక దాడులు జరిపింది.

జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితికి, లోయలో వేల సంఖ్యలో మరణాలు సంభవించడానికి కూడా పాకిస్తాన్ ఉగ్రవాదమే కారణమని దీన్ని ప్రతిపక్షం బాధ్యతతో అర్ధం చేసుకోవాలని ప్రధాని మోడీ అన్నారు. ఇంతకు ముందు, కాశ్మీర్ లో సమస్యల పరిష్కారానికి ఏం చేశారు? 3-4 కుటుంబాలు సమస్యలను ఆలంబన చేసుకుని అధికారంలో కొనసాగాయాని అన్నారు.

Related posts

గణేష్ శోభాయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు

Bhavani

పెద్దపులుల అడ్డాగా నల్లమల గడ్డ

Satyam NEWS

పేదలకు నిత్యావసరాలు అందించిన ఏ.ఆర్ సిబ్బంది

Satyam NEWS

Leave a Comment