ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. త్వరలో జరగబోయే సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా వివాహం మొహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు మొహమ్మద్ అసదుద్దీన్ తో జరగబోతున్నది.
ఇప్పటికే వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ పూర్తి అయింది. త్వరలో జరగబోయే వివాహానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ రెండు కుటుంబాలు ఆహ్వానించాయి. ప్రగతి భవన్ లో సానియా మీర్జా తన తండ్రితో కలిసి హాజరు కాగా మొహమ్మద్ అజారుద్దీన్ తన కుమారుడితో కలిసి వచ్చి కేసీఆర్ ను ఆహ్వానించారు.