33.7 C
Hyderabad
April 29, 2024 02: 49 AM
Slider జాతీయం

సరిహద్దులో ఉద్రిక్తత పెంచడమే చైనా ఉద్దేశ్యం

#manojpandaysmall

సరిహద్దు సమస్యలను తగ్గించుకోవాలని భారత్ ప్రయత్నిస్తుంటే ఆ సమస్యలను పెంచుకోవడానికి చైనా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వ్యాఖ్యానించారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడమే చైనాతో ప్రాథమిక సమస్య అని జనరల్ మనోజ్ పాండే చెప్పారు.

జనరల్ పాండే భారత ఆర్మీ చీఫ్‌గా గత వారమే బాధ్యతలు స్వీకరించారు. భారతదేశం, చైనా సైన్యం మధ్య వివాదం తూర్పు లడఖ్‌లో 4-5 మే 2020లో ప్రారంభమైంది. జూన్ 15న గాల్వాన్‌లో ఇరు సేనలు ముఖాముఖి తలపడ్డాయి. ఈ హింసాత్మక ఘర్షణలో భారత్ సైనికులతో బాటు చైనా వారు కూడా మరణించారు.

ఏప్రిల్ 2020కి ముందు తూర్పు లడఖ్‌లో యథాతథ స్థితిని పునరుద్ధరించడమే భారత సైన్యం లక్ష్యం అని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే స్పష్టం చేశారు. దౌత్య మరియు సైనిక స్థాయిలో చర్చల తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని ఆయన అన్నారు.

Related posts

వైసిపి దౌర్జన్యం చేస్తే ఫొటోలు వీడియో ఆధారాలు సేకరించండి

Satyam NEWS

కేసీఆర్ పాలనలో తెలంగాణ దిగజారిపోయింది

Satyam NEWS

దాసరి జయంతి సందర్భంగా పాన్ ఇండియా దర్శకులకు సత్కారం

Satyam NEWS

Leave a Comment