30.7 C
Hyderabad
April 29, 2024 04: 13 AM
Slider కృష్ణ

వెన్నుపోటు వైసీపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య

#bandreddyramakrishna

మచిలీపట్నం మీడియా సమావేశంలో జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ

వెన్నుపోటు అంటే ఏంటో వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి తల్లిని, చెల్లిని అడిగితే తెలుస్తుందని, వెన్నుపోటు వైసీపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అని జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ వ్యాఖ్యానించారు. అబద్దపు హామీలు చెప్పి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత వ్యాఖ్యలు చేసే వైసీపీ వాళ్ళు రాష్ట్ర ప్రజలకు చేసింది మాత్రం శూన్యమన్నారు. మళ్లీ మంత్రి పదవి ఇస్తారన్న ఆశతోనే బందరు శునకం విశ్వాసం చూపుతూ మొరుగుతున్నారని ఆరోపించారు. ముందుగా మాజీ మంత్రి పేర్ని నాని పోర్టు ఏమయ్యిందో బందరు ప్రజలకు చెప్పి మాట్లాడాలని డిమాండ్ చేశారు. చిరంజీవి మీద లేని ప్రేమలు వలకబోస్తూ అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. సోమవారం మచిలీపట్నంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ

“జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన న్యాయవాదుల సదస్సులో మాట్లాడుతుంటే అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు మొదలయ్యింది. వెంటనే ప్యాలెస్ లో ఉన్న నాయకులకు విశ్వాసం చూపేందుకు కుక్కలంతా మీడియా ముందు మొరగడం మొదలుపెట్టాయి. బందరు మాజీ మళ్లీ మంత్రి పదవి వస్తుందన్న ఆశతో మొరుగుతున్నట్టున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎప్పుడు మాట్లాడుతారా అని ఎదురుచూడడం.. మాట్లాడిన తర్వాత మీడియా ముందుకు వచ్చి వ్యక్తిగత విమర్శలు చేయడం. పరిపాలనలో పట్టులేదు. ప్రజల ఇబ్బందులు పట్టవు. ఇప్పుడు సున్నిత మనస్కులైన చిరంజీవి మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది. ఆయన్ని లాగి అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మీలాంటి వారంతా కలసి ఆనాడు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కోవర్టులను పంపి ఎవరెవరు ఎంత మోసం చేశారో? ఎవరి కారణంగా ఆయన రాజకీయాలకు దూరంగా జరిగిపోయారో అందరికీ తెలుసు. రాజకీయాల్లో ఉన్న మీలాంటి చెత్తను ఏరివేయడానికే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. మీ ఆటలు సాగనివ్వరు.

వెన్నుపోటు అంటే మీ ప్రభుత్వానిదే

వెన్నుపోటు.. వెన్నుపోటు అంటున్నారు. అయ్యా నాని బందరు ప్రజలకు మీరు చేసింది ఏంటి? ఎన్నిసార్లు ఎన్నికల్లో బందరు పోర్టు పేరు చెప్పి ప్రజల్ని మీరు వెన్నుపోటు పొడిచారు. ఇప్పటికీ అస్థవ్యస్థంగా ఉన్న బందరు డ్రైనేజీ వ్యవస్థ గురించి ఏం చెబుతారు. ఎన్నికల ముందు అది చేస్తా ఇది చేస్తానని చెప్పి వంచించడం వెన్నుపోటు కాదా? వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చెప్పింది ఒకటి చేసింది ఒకటి. సీపీఎస్ రద్దు చేస్తామని ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారు. ప్రభుత్వంలో మూడున్నర లక్షల ఉద్యోగాలు ఉన్నాయన్నారు. ప్రైవేటు రంగంలో కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. యువత ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలసపోయేలా చేశారు. అది వెన్నుపోటు కాదా? మద్యనిషేధం పేరు చెప్పి మహిళల్ని వంచించారు. అది వెన్నుపోటు కాదా. భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారు. వారి నిధులు దారి మళ్లించి వారిని వెన్నుపోటు పొడిచారు. ప్రణాళికా సంఘం నిధుల కోసం పంచాయితీ ఎన్నికలు పెట్టి.. ఆ నిధులు కాస్తా కొట్టేసి పంచాయితీలకు వెన్నుపోటు పొడిచారు. ఇప్పటికీ రాజధాని మీద స్పష్టత లేదు. ప్రభుత్వం దగ్గర రూ. వెయ్యి కోట్లు లేకుండా మూడు రాజధానులు ఎలా అభివృద్ధి చేస్తారు.

చిత్తశుద్ది ఉంటే ప్రభుత్వ విధానాల మీద చర్చ

ఏ అంశం మీద చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం. చివరికిగా పేర్ని నాని కి ఒక్కటే చెబుతున్నా.. 45 సీట్లు.. 45 సీట్లు అని గింజుకుంటున్నారుగా మీ పార్టీ గెలిచే ఆ 45 స్థానాల్లో మచిలీపట్నం పేర్ని నాని ఖచ్చితంగా ఉండరు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా బందరు గడ్డ మీద జనసేన జెండా పాతుతాం. ఎన్నికలు సమీపించే నాటికి ఆ 45ని 25కి తీసుకువస్తాం అని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ మచిలీపట్నం అసెంబ్లీ ఇంఛార్జ్ బండి రామకృష్ణ, పార్టీ నాయకులు వంపుగడల చౌదరి, గెడ్డం రాజు, సమీర్, పంచకర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మోసాల కాంగ్రెస్ కు వచ్చేది 20 సీట్లే

Satyam NEWS

కరోనా వైరస్ వ్యాప్తికి ఏ శిక్ష వేస్తారో తెలుసా?

Satyam NEWS

స్కూలు బస్సు బోల్తా

Murali Krishna

Leave a Comment