42.2 C
Hyderabad
May 3, 2024 15: 17 PM
Slider మహబూబ్ నగర్

ప్రత్యక్ష బోధనకు సంక్షేమ పాఠశాలలు సన్నద్ధం కావాలి

#manuchowdaryias

ప్రత్యక్ష బోధనా తరగతులు ప్రారంభించడానికి  అన్ని గురుకుల పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు ఈ నెల చివరి నాటికి సర్వం సిద్ధం చేసి ఉంచాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. సెప్టెంబర్, 1వ తేది నుండి ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాఠశాలల పునఃప్రారంభం సన్నద్ధత  పై సంక్షేమ శాఖల అధికారులు, జిల్లా సమన్వయ కర్తలు, పాఠశాలల  ప్రిన్సిపాల్, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ అన్ని పాఠశాలల పరిసరాలు, తరగతి గదులు, వంట గదులు,  మంచి నీటి ట్యాంకు లు పరిశుభ్రం చేయించాలని సూచించారు.  గ్రామ పరిధిలో అయితే పంచాయతి సిబ్బంది, మున్సిపాలిటిలలో అయితే మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేయాల్సి ఉంటుందన్నారు.  సర్పంచులు, మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడి పనులు చేయించుకోవలన్నారు. ఎక్కడైనా చేయకుంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని తెలియజేసారు. 

ప్రతి పాఠశాల తరగతి గదులు, పరిసరాల్లో సోడియం హైపోక్లోరైడ్ లేదా బ్లీచింగ్ చల్లించాలని సూచించారు.  వీటికి తోడు మంచి నీటి నల్ల అనుసంధానం, విద్యుత్ సమస్యలు, లైట్లు తదితర చిన్నపాటి  రిపేర్లు ఉంటే గ్రామ పంచాయతి లేదా మున్సిపల్ నిధులతో మరమ్మతులు చేయించుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అందరు మండల అభివృద్ధి అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 

బోధనా, బోధనేతర సిబ్బంది ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ చేసుకొని ఉండాలని, ఒకవేళ మొదటి డోస్ మాత్రమే తీసుకొని ఉంటే సమయానికి రెండవ డోస్ తీసుకునే విధంగా చూడాలన్నారు.  పాఠశాలలు ప్రారంభించే సమయానికి సర్వం సిద్ధం చేసి పిల్లలు వచ్చేటప్పుడు  మాస్క్ లు లేని వారికీ మాస్క్ లు అందించి తప్పని సరిగా ధరించే విధంగా చూడాలన్నారు.   సానిటైజర్లు అందుబాటులో ఉంచడం, సాధ్యమైనంత వరకు పిల్లలను దూరం పాటించే విధంగా చూడాలన్నారు.  

ఎవరికైనా జ్వరం, జలుబు లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించాలన్నారు.  లక్షణాలు ఉన్న వ్యక్తి ఎవరెవరితో కలిసి ఉన్నడో తెలుసుకొని వారందరికి కరోనా పరీక్షలు చేయించాలని తెలియజేసారు.  ప్రతి రోజు ప్రిసిపాల్ తమ జిల్లా అధికారికి కోవిడ్ నివేదిక అందజేయాలని తద్వారా అధికారులు తనకు రోజువారీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. 

పాఠశాలల్లో  ఎక్కడ కోవిడ్ రాకుండా కోవిడ్ నిబంధనలు కటినగా అమలు చేయాలనీ ఆదేశించారు.  ఈ సమావేశంలో జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి రాంలాల్, జిల్లా సమన్వయ కర్తలు, ప్రిన్సిపాల్ లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జగన్ అక్రమాస్తుల కేసు డిసెంబర్ 6కి వాయిదా

Satyam NEWS

సొంత ఇంట్లోనే తల్లీకూతుళ్ల దారుణ హత్య

Satyam NEWS

గుంటూరు జిల్లాలో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు

Satyam NEWS

Leave a Comment