38.2 C
Hyderabad
April 29, 2024 19: 09 PM
Slider గుంటూరు

గుంటూరు జిల్లాలో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు

#Suspended

గుంటూరు జిల్లాలో ఇద్దరు పోలీసు అధికారులపై క్రమశిక్షణ వేటు పడింది. డివిజన్ స్థాయి అధికారి, ఇన్ స్పెక్టర్ పై పోలీసు శాఖ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.

దీని వెనుక పూర్వాపరాలను పరిశీలిస్తే జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే వ్యక్తిగత ఫోన్ కాల్ డేటాను అనధికారికంగా సేకరించిన విషయం బయటకు లీక్ అయింది.

ఈ విషయం సదరు ఎమ్మెల్యేకు తెలిసింది. దీంతో ఆ ఎమ్మెల్యే జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది.

దీనిపై విచారణ జరపాల్సిందిగా సిఎం డిజిపిని ఆదేశించినట్లు సమాచారం. డిజిపి విచారణ జరిపిన అనంతరం ఆ ఇద్దరు పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం పోలీసులు రాజకీయ వర్గాలలో కలకలం సృష్టించింది. అయితే ఆ ఎమ్మెల్యే కాల్ డేటాను ఎవరు ఎందుకు సేకరించారనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది.

Related posts

ఆటో డ్రైవరు నిజాయితీతో బాధితులకు చేరిన బ్యాగులు

Satyam NEWS

64 కళలూ పండిన మాయాబజార్ కు 64 ఏళ్లు నిండాయి!

Satyam NEWS

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

Leave a Comment