26.7 C
Hyderabad
May 3, 2024 07: 59 AM
Slider జాతీయం

రాష్ట్రపతిని కించపరిచిన పశ్చిమబెంగాల్ మంత్రిని అరెస్టు చేయాలి

#locketchetarji

మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అఖిల గిరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కించపరిచే వ్యాఖ్యల అంశం తీవ్ర రూపం దాల్చింది. ఈ విషయమై హుగ్లీకి చెందిన బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ ఈరోజు న్యూఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకుని అఖిల గిరిపై ఐపీసీ, ఎస్సీ-ఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లాకెట్ ఛటర్జీ తన ఫిర్యాదులో పోలీసులను అభ్యర్థించారు. ద్రౌపది ముర్ముని అవమానించిన అంశంపై మహిళ అయినప్పటికీ మమతా బెనర్జీ ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు.

ఈ విషయంపై మమతా బెనర్జీ సమాధానం చెప్పాలని లాకెట్ ఛటర్జీ అన్నారు. అఖిల గిరి ని మంత్రి వర్గం నుంచి  వెంటనే బర్తరఫ్ చేయాలి. ఢిల్లీకి వచ్చి క్షమాపణ చెప్పాలి అని ఆమె డిమాండ్ చేశారు. ఎస్సీ-ఎస్టీ వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడటమే TMC మంత్రుల సంస్కారమని ఆమె అన్నారు. ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లో ఇదే జరిగి ఉంటే మమతా బెనర్జీ, ఆమె నేతలు, మేధావులు తక్షణమే క్యాండిల్‌ మార్చ్‌ చేసి ఉండేవారని బీజేపీ ఎంపీ ఎద్దేవా చేశారు.

మమతా బెనర్జీ మంత్రివర్గ సభ్యుడు చేసిన ఈ ప్రకటనను ఢిల్లీలోనే కాకుండా దేశం నలుమూలలా వ్యతిరేకించాలని, మహిళలంతా తమ గళం వినిపించాలన్నారు. ఒడిశాలోని రాయరంగ్‌పూర్‌లో టీఎంసీ నేత అఖిల గిరిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక రాయరంగపూర్ ఎమ్మెల్యే నాబ్ చరణ్ మాంజీ ఈ ఫిర్యాదు చేశారు.

రాయ్‌రంగ్‌పూర్ రాష్ట్రపతి ముర్ము స్వస్థలం. గిరి ప్రకటన మహిళలను, ఎస్టీ/ఎస్సీ వర్గాలను అవమానించేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గిరిని వెంటనే అరెస్టు చేయాలని ఫిర్యాదుదారు డిమాండ్ చేశారు. అఖిల గిరి వ్యాఖ్యలకు నిరసనగా గిరిజన సంఘం ప్రజలు బంకురాలో రోడ్డును దిగ్బంధించారు. నందిగ్రామ్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ, TMC నాయకుడు అఖిల్ గిరి రాష్ట్ర పతి ద్రౌపది ముర్ముపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు.

Related posts

కొలిక్కి వచ్చిన ఖమ్మం, పాలేరు పంచాయతి

Satyam NEWS

వెల్ఫేర్ విభాగాలను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ నర్మద

Satyam NEWS

కేంద్ర ఆర్ధికమంత్రి బడ్జెట్ ఆశా జనకం

Satyam NEWS

Leave a Comment