38.2 C
Hyderabad
April 29, 2024 21: 20 PM
Slider నెల్లూరు

ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రోడ్లు డ్రైన్లు వేస్తాం

#Adala Prabhakar Reddy

నెల్లూరు రూరల్ పరిధిలో ఎక్కడ రోడ్లు, డ్రైన్లు అవసరమో అక్కడ తప్పకుండా వాటిని ఏర్పాటు చేస్తామని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 23వ డివిజన్లోని చలపతి నగర్ లో శనివారం సాయంత్రం జరిగిన గడపగడపకు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసరెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 23వ డివిజన్లోని గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు పథకాలు సక్రమంగా అందుతున్నాయని స్థానికులు చెప్పడం సంతోషం కలిగించిందని తెలిపారు.

ఈ సచివాలయం పరిధిలో రోడ్లు, డ్రైన్ల కోసం 40 లక్షల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పారు. ఇదే విధంగా ప్రతి డివిజన్లోని మూడు సచివాలయాల పరిధిలో 40 లక్షల రూపాయలు చొప్పున వెచ్చిస్తామని చెప్పారు. ప్రతి డివిజన్లో జనరల్ ఫండ్ నుంచి ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి, కార్పొరేటర్లు మూలే విజయభాస్కర్ రెడ్డి, సత్తార్, అవినాష్, మోబినా, వైసీపీ నేతలు పాతపాటి పుల్లారెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, హరిబాబు యాదవ్, రియాజ్, మేఘనాథ్ సింగ్, సుబ్బారెడ్డి, సూరిబాబు, సురేష్ రెడ్డి, టీవీఎస్ కమల్, వైసిపి జిల్లా మహిళా నేత గౌరీ (కార్పొరేటర్) మల్లు సుధాకర్ రెడ్డి (జడ్పిటిసి) తదితరులు పాల్గొన్నారు.

Related posts

జీడిమెట్ల పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరి మృతి

Satyam NEWS

క్రైస్తవులకు షబ్బీర్ అలీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

Satyam NEWS

అత్యాధునిక పరిజ్ఞానం వాడుతున్న అసెంబ్లీ

Satyam NEWS

Leave a Comment