35.2 C
Hyderabad
April 30, 2024 23: 37 PM
Slider చిత్తూరు

శ్రీవాణి ట్రస్ట్ పై భక్తుల్లో తీరని అనుమానాలు !

#Naveen Kumar Reddy

శ్రీవాణి ట్రస్ట్ పై టీటీడీ వెల్లడించిన లెక్కల్లో తేడాలు ఉన్నాయనే అనుమానాలు భక్తులకు ఉన్నాయని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. శ్రీ వాణీ ట్రస్టు ప్రారంభం నుంచి నేటి వరకు ప్రతిరోజు ఎన్ని టికెట్లు ఇచ్చారు? ఆఫ్లైన్లో ఎన్ని ఇచ్చారు? ఆన్లైన్లో ఎన్ని ఇచ్చారు? రోజువారి ఆదాయం ఎంత వచ్చింది? డిజిటల్ పేమెంట్ లో ఎన్ని టికెట్లు ఇచ్చారు? కంప్యూటర్లు మొరాయించినప్పుడు నగదు తీసుకొని ఏమైనా టిక్కెట్లు ఇచ్చారా అన్న సమగ్రమైనటువంటి సమాచారంతో వివరంగా ఇస్తే దానిని శ్వేత పత్రం అంటారు.

టీటీడీకి సంబంధించిన డిపాజిట్లను ప్రైవేటు బ్యాంకులలో డిపాజిట్లు చేయకూడదని శ్రీవారి భక్తునిగా తాను హైకోర్టులో పిల్ వేసినట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అప్పటి ఈవో ఇకపై జాతీయ బ్యాంకులలోనే డిపాజిట్ లు చేస్తామని కోర్టుకి హామీ ఇవ్వడం జరిగింది అలాంటిది తిరిగి శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చిన నిధుల శ్వేత పత్రం చూస్తే జాతీయ బ్యాంకులతో పాటు చాలా ప్రైవేట్ బ్యాంకులలో కూడా కోట్లాది రూపాయలు డిపాజిట్లు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది వీటి కారణంగా శ్రీవారి భక్తులలో పలు అనుమానాలకు తావిస్తోందని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.

“శ్వేత పత్రం” అంటే ప్రతి పైసాకు జవాబుదారీగా ఉండాలి అలాకాకుండా 850 కోట్లు వచ్చింది బ్యాంకులో డిపాజిట్ చేసాము అని శ్వేత పత్రం విడుదల చేసి చేతులు దులుపుకుంటే అది స్టేట్మెంట్ కాపీ అవుతుంది కానీ శ్వేత పత్రం కాదు అని ఆయన అన్నారు. శ్రీవారి భక్తులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత టిటిడి అధికారులపై ధర్మకర్తల మండలి పై మాత్రమే ఉంటుంది అది వారి బాధ్యత అని తెలియజేస్తున్నాను అని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.

Related posts

NSUI నాయకుల అరెస్ట్ అప్రజాస్వామ్యం

Satyam NEWS

“కళ్యాణం కమనీయం” చిత్రం నుంచి “హో ఎగిరే” లిరికల్ సాంగ్ రిలీజ్

Bhavani

సోమసుందర్ నగర్ పార్కు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కాలేరు

Bhavani

Leave a Comment