31.7 C
Hyderabad
May 2, 2024 10: 41 AM
Slider హైదరాబాద్

ఎన్నో సంక్లిష్ట సమస్యలకు పరిష్కారం చూపే డేటా సైన్స్

#datascience

సిబిఐటి కళాశాల లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ఈ నెల 26 నుండి 30 వరకు “ఇంజనీరింగ్ కోసం  డేటా సైన్స్‌లో తాజా ధోరణిలు”  పై జాతీయ స్థాయి లో ఒక వారం ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోందని కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటన లో తెలిపారు. ప్రారంభ సమావేశం లో ముఖ్య అతిధి గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్  చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ మరియు గ్లోబల్ హెడ్  బాల ప్రసాద్ పెద్దిగారి విచ్చేసి డేటా సైన్స్ అనేది విస్తృతమైన విషయాలతో వ్యవహరించే  డొమైన్ అని తెలిపారు.

ఆధునిక సాధనాలు, సాంకేతికతలను ఉపయోగించి డేటా వాల్యూమ్‌లు కనిపించని నమూనాలను కనుగొని అర్థవంతమైన సమాచారాన్ని పొందడం వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి వీలుకల్పిస్తుందని తెలిపారు. ప్రపంచంలోని అనేక సంక్లిష్ట సమస్యలకు డేటా సైన్స్ పరిష్కారాలను చూపుతుందని అన్నారు.  ప్రిన్సిపల్ డాక్టర్ పి.రవీందర్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తూ పరిశ్రమలో డేటా సైన్స్ అవసరాలు మరియు వివిధ  సవాళ్ల  గురుంచి వివరించారు. 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం అధిపతి డాక్టర్ రజనీకాంత్ అలువాలు  “ఎక్స్‌ప్లెయిన్బుల్ కృత్రిమ మేధస్సు” అనే అంశంపై వివరించారు . దేశం లో వివిధ రాష్ట్రాల నుంచి  400 అధ్యాపకులు   ఆన్ లైన్ ధ్వారా  హాజరయ్యారని ఐటి విభాగానికి చెందిన ప్రోగ్రాం కోఆర్డినేటర్లు ప్రొఫెసర్ ఎం. వేణు గోపాలాచారి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎ. శిరీష, పి.కిరణ్మయి తెలిపారు.

Related posts

పోలీసులకు మంచి నీళ్లు కూడా ఇచ్చేది లేదు

Satyam NEWS

కుర్చికి వినతిపత్రం ఇచ్చిన విద్యార్థి, యువజన సమితి నేతలు

Satyam NEWS

అహంకారపూరితంగా మాట్లాడుతున్న సిఎం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment