31.2 C
Hyderabad
February 14, 2025 20: 40 PM
Slider ఆంధ్రప్రదేశ్

మీరే చెప్పేదానికి కమిటీ వేయడం దేనికి?

pawan-kalyan-close-up

తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే… కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట. అలాగ… ఒక్క అమరావతి రాజధానికే దిక్కు దివాణం లేదు ఇప్పటి దాక, మరి జగన్ రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అసలు అయ్యేనా? పాలకులు వలన, రాష్ట్ర విభజన మొదలుకొని ఇప్పటిదాకా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి అనిశ్చితి, అశాంతి, అభద్రత తప్ప ఇంకేమీ ఒరగలేదు.

కమిటీ రిపోర్ట్ రాక మునుపే, జగన్ రెడ్డి గారు మూడు రాజధానులు ప్రకటించేకాడికి, అసలు కమిటీలు వెయ్యడం దేనికి? నిపుణుల్ని అపహాస్యం చెయ్యటం దేనికి? ప్లీనరీలో అమరావతికి ఓకే అన్నందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతారా?. మాట తప్పను, మడమ తిప్పను అంటే ఇదేనా?.

కేంద్రం అమరావతిని గుర్తించింది. మ్యాప్ లో మార్పు చేసింది. ఏపీ నూతన రాజధానిగా కేంద్రం నోటిఫై చేయాలంటే మూడు ప్రాంతాల్లో దేన్ని నోటిఫై చేయాలి. హైకోర్టు కర్నూలులో ఉంటే శ్రీకాకుళం నుంచి కర్నూలుకి వెళ్లలా? అనంతపురం నుంచి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్ళి ఉద్యోగాలు చేయాలా?

సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు లేదా సెక్రటేరియట్ లో పని ఉంటే వెళ్ళటం సాధ్యమయ్యే పనేనా?

ఇట్లు

పవన్ కళ్యాణ్

అధ్యక్షులు – జనసేన పార్టీ

Related posts

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నోముల భగత్

Satyam NEWS

ఇండియన్ఆస్ట్రోనాట్:అంతరిక్షయాత్రలో హైదరా బాద్‌ వాసి

Satyam NEWS

తెలంగాణకు మరో జాతీయ అవార్డు

mamatha

Leave a Comment