26.7 C
Hyderabad
May 3, 2024 08: 54 AM
Slider చిత్తూరు

వెంకన్న పేరు చెప్పి రుణాలు తీసుకుని పరారైతే…..?

#NaveenkumarReddy

విరాళాల స్వీకరణలో ముందస్తు పరిశీలన చేయకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముంబై కి చెందిన ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారితో 300 పడకల చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి ఎంఓయూ చేసుకోవడం అనుమానాలకు తావిస్తోందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

రూ.300 కోట్లు విరాళం ఇస్తామన్న ఆ కంపెనీ మాటలు టీటీడీ ఎలా నమ్మిందని ఆయన ప్రశ్నించారు. TTD కి భక్తులు వివిధ మార్గాల్లో భారీగా విరాళాలు అందిస్తుంటారు. అందులో మొదటి విధానం నేరుగా వచ్చి హుండీలో నగదును,రెండో విధానంలో విరాళ మొత్తాన్ని డీడీ రూపంలో అందిస్తూ ఉంటారు,మూడో విధానంలో దాతే స్వయంగా వచ్చి శ్రీవారిపై ఉన్న భక్తితో టీటీడీ వారు కోరిన పనులు తన నగదుతో చేయిస్తుంటారు.

టీటీడీ అతిపెద్ద పరిపాలన వ్యవస్థ  ప్రత్యేకంగా సివిల్ ఇంజనీరింగ్ విభాగం,ఆర్థిక విభాగం, న్యాయవిభాగం,నిఘా భద్రతా విభాగాల్లో ఎంతో మంది అనుభవజ్ఞులైన అధికారులు వున్నారు. ఉద్వేగ్ సంస్థ ఆర్థిక పరిస్థితి, నైపుణ్యత పై టీటీడీ ముందస్తుగా ఎటువంటి పరిశీలన చేయకుండా నేరుగా ఒప్పందం కుదుర్చుకోవడంలోని ఆంతర్యం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు.

తిరుమల కొండపై సాధారణ భక్తులు విరాళంతో అతిథిగృహాలు నిర్మించాలన్నా ముందస్తుగా తితిదే సెక్యూరిటీ డిపాజిట్టుగా రూ.కోట్లు కట్టించుకుంటుంది. అటువంటిది రూ.300 కోట్ల ప్రాజెక్టును ఆమోదించే సమయంలో కనీసం అందులో 10% నగదునైనా TTD ముందస్తుగా స్వీకరించి ప్రాజెక్టు ఒప్పందం ఎందుకు చేసుకోలేదు??

టీటీడీ ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం లక్ష రూపాయల పనికి సైతం (EMD) ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ అలాగే (ASD) అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్ టీటీడీ ఈవో పేరున కట్టాలి మరి ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో డిపాజిట్ ఎందుకు కట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు.

TTD కి భారీ విరాళం ఇచ్చే వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు,కంపెనీ అయితే దాని ఆర్థిక పరిస్థితి,గతంలో ఇటువంటి విరాళాల అందించిన చరిత్రపై తితిదే పరిపాలన విభాగంలోని ఆర్థిక, న్యాయ, భద్రతా విభాగాల ద్వారా సమగ్రపరిశీలన చేయించకుండా విరాళం ఎలా ఆమోదించి ఎంఓయూ చేయించుకుంటారని ఆయన ప్రశ్నించారు.

అలిపిరి బైపాస్ రోడ్ లో ఇప్పటికే టీటీడీ అనేక ప్రైవేటు సంస్థలకు 10 ఎకరాల చొప్పున కట్టబెట్టేశారు! టూరిజంతో ఓ ప్రైవేటు సంస్థ కోట్ల విలువ చేసే స్థలంలో హోటల్స్ నిర్వహిస్తామని MOU చేసుకుని తద్వారా బ్యాంకు రుణాలు పొందడం పనులు ప్రారంభించకపోవడం కొన్ని సంవత్సరాలుగా జూ పార్క్ రోడ్ లో కనిపిస్తున్న దృశ్యం టిటిడి అధికారులకు కనిపించలేదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

టిటిడి తో ఎంఓయూ చేసుకొని రేపు ఆ MOU ఆధారంగా ఆసుపత్రి నిర్మాణం కోసం కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు పొంది పనులు ప్రారంభించకపోతే టీటీడీ ఉన్నతాధికారులు ధర్మకర్తల మండలి బాధ్యత వహిస్తుందా అని ఆయన ప్రశ్నించారు.

Related posts

గ్రంథాలయ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి!

Satyam NEWS

ఢిల్లీ న్యాయవాదికి బెదిరింపు వచ్చింది రాజంపేట నుంచే

Satyam NEWS

స్కూళ్లు శానిటైజ్ చేయకపోతే కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment