29.7 C
Hyderabad
May 1, 2024 08: 54 AM
Slider ముఖ్యంశాలు

అవమానకర రీతిలో గౌతమ్ సవాంగ్ అవుట్

#appolice

ఎంతో విధేయతతో పని చేసిన ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆ పదవి నుంచి అత్యంత అవమానకర రీతిలో తొలగించారు. ఆ స్థానంలో 1992 బ్యాచ్ ఐ పి ఎస్ అధికారి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కి అదనపు బాధ్యతలు అప్పగించారు. 2023 జూలై వరకు గౌతమ్ సవాంగ్ పదవీకాలం ఉంది. అయినా ఆయనను అక్కడ నుంచి తప్పించారు. గౌతమ్ సవాంగ్ కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జీ ఏ డీ లో రిపోర్టు చేయాలని గౌతమ్ సవాంగ్ కు ఆదేశాలు జారీ చేశారు. రెండు, మూడు రోజుల్లో ఏపీ ప్రభుత్వం ముగ్గురి పేర్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నది. కేంద్రం అనుమతి రాగానే డీజీపీగా కసిరెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగిస్తారు. 2026 ఏప్రిల్ 30 వరకు కసిరెడ్డి విధుల్లో ఉండే అవకాశం ఉంది. రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. గతంలో హైదరాబాద్ ఈస్ట్ డీసీపీగా ఆయన పని చేశారు. గతంలో విజయవాడ, విశాఖ సిపి గా కూడా ఆయన పనిచేశారు.

Related posts

ఎంఐఎం అధినేత ఒవైసీపై దేశద్రోహం కేసు పెట్టాలి

Satyam NEWS

బి ఫార్మసీ విద్యార్ధుల కథ విషాదాంతం: ప్రేమ జంట ఆత్మహత్య

Satyam NEWS

ట్రాజెడీ: అదృశ్యమై అడవిలో శవంలా కనిపించిన సంజన

Satyam NEWS

Leave a Comment