29.7 C
Hyderabad
May 2, 2024 05: 08 AM
Slider నల్గొండ

అక్రమ అరెస్టులతో రైతుల ఉద్యమాన్ని ప్రభుత్వం ఆపలేదు

#congressparty

రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ధర్నాలో పాల్గొంటే అరెస్ట్ చేయడం బాధాకరమని టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ అజీజ్ పాషా అన్నారు.

భారత్ బంద్ లో భాగంగా అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం భారత్ బంద్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించేంత వరకు అఖిలపక్షాలు పోరాడుతూనే ఉంటాయని అజీజ్ పాషా అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.గల్లిమే కుస్తీ ఢిల్లిమే దోస్తీ అనే విధంగా కెసిఆర్ నియంతలా  వ్యవహరిస్తున్నాడని మండ్డిపడ్డారు.

పక్క రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సొంతంగా బస్ డిపోలు బంద్ ప్రకటిస్తే ఇక్కడ ప్రభుత్వం మాత్రం బస్సులు నడపడం చాలా దురదృష్టకరమని అన్నారు.

అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు రైతులు,ప్రజలందరు బంద్ లో పాల్గొని నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

రైతు లకు బేడిలు వేసిన ఘనత కె సి ఆర్ కే దక్కుతుందని,ఖమ్మంలో మిర్చి యార్డులో విధించిన సంకెళ్లు ఇంకా గుర్తే ఉందని,జరుగుతున్న పరిణామాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని,రానున్న రోజుల్లో మోడీ,కెసిఆర్ గద్దె దిగడం ఖాయం అన్నారు. జాతీయ విద్య విధానం రద్దు చేయాలని,విద్యకు బడ్జెట్ లో ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు,కార్యకర్తలు, అఖిల పక్ష నేతలు అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఘనంగా సుదర్శన హోమం

Satyam NEWS

విద్యాశాఖ మంత్రి దృష్టికి టీచర్ల సమస్యలు

Satyam NEWS

జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన బిచ్కుంద క్రీడాకారుడు

Satyam NEWS

Leave a Comment