38.2 C
Hyderabad
April 29, 2024 19: 13 PM
Slider ముఖ్యంశాలు

మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్

#ushasree

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ కేసులో ఆమెతోపాటు మరో ఏడుగురు విచారణకు పదేపదే గైర్హాజరు కావడంతో కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ జడ్జ్ సుభాన్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు 27 ఫిబ్రవరి 2017న ఉషశ్రీ చరణ్‌పై అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఆమె ర్యాలీ నిర్వహించారంటూ అప్పటి తహసీల్దార్ డీవీ సుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 188 కింద ఉషశ్రీతోపాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణకు నిందితులు పదేపదే గైర్హాజరు కావడంతో కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Related posts

జన హృదయ విశ్వ విజేత జనం మెచ్చిన మహా నేత

Satyam NEWS

నేతన్నల ను ముంచిన వరుస వర్షాలు

Satyam NEWS

ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ లేని బ‌డ్జెట్ ఇది

Satyam NEWS

Leave a Comment