Slider గుంటూరు

ధనవంతులు కాదు కానీ పెద్ద మనసున్న మహిళలు

Ponnur women

కరోనా వైరస్  వ్యాప్తి చెందటంతో గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో కొందరు పేదవారు ఆకలితో బాధపడుతున్నారు. మరి కొందరు స్వఛందంగా దాతలు ఎవరైనా ఇస్తే తీసుకొని ఆ పూట గడుపుతున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో కొందరు మహిళలు తామే స్వయంగా ముందుకు వచ్చి వారికి ఉన్నదాంట్లోనే ఇతరులకి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

అలాగని వారు ధనికులు కాదు. కానీ పేదవారికి సహాయం చేసే మంచి మనసు ఉన్న మహిళలు. పొన్నూరు పట్టణంలో ని టీచర్స్ కాలానికి చెందిన షేక్.గౌశ్య, రహంతుల్లా, షేక్ మజిదునె, కరిష్మ దంపతులు మరి కొందరు మహిళలు ఆదివారం రెడ్ జోన్ లో ఉన్న150 కుటుంబాల వారికి   ఆహార పొట్లాలు పంపిణీ చేసారు.

అనంతరం తయారు చేసిన పొట్లాలు వాలంటీర్లకు ఇవ్వగా వారు రెడ్ జోన్ లో ఉన్న వారికి  అందచేశారు. ఈ కార్యక్రమంలో   మున్సిపల్ ఆర్.ఐ తో పాటు స్థానికులు సర్తాజ్, బీబీజన్, బాజి, రేష్మ, అజ్మీ, ఏసమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

17 నుంచి 26వ తేదీ వరకు తిరుచానూరులో నవరాత్రి ఉత్సవాలు

Satyam NEWS

ఒంగోలు వ్యాపారులకు లాక్ డౌన్ సడలింపులు ఇవ్వాలి

Satyam NEWS

ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి

Satyam NEWS

Leave a Comment