26.7 C
Hyderabad
May 3, 2024 09: 49 AM
Slider తూర్పుగోదావరి

పోలీసుల ఎదుట లొంగిపోయిన మహిళా మావోయిస్టు

#maoist

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ ఓఎస్డి కార్యాలయంలో జిల్లా ఎస్ పి సతీష్ కుమార్ ఎదుట ఎటపాక మండలం సాలి బుడిపె గ్రామానికి చెందిన పొడియం జోగమ్మ అలియాస్ రితిక (18) అనే మహిళా మావోయిస్టు లొంగిపోయింది.

ఈ సందర్భంగా చింతూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఓ ఎస్ డి జి కృష్ణకాంత్ మాట్లాడుతూ ఎటపాక మండలం సాలిపేట గ్రామం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో తరచూ మావోయిస్టు నాయకులు గీత, సంధ్య అనే ఏ సీఎం కేడర్ వచ్చి సమావేశాలు పెట్టి ప్రజలను ఆకట్టుకునేలా చేశారని తెలిపారు.

భారీ ఆటపాటలకు ఆకర్షితులైన రితిక అనే అమ్మాయి 2019 సంవత్సరం డిసెంబర్ నెలలో దళ నెంబర్ గా నియమితులైన దన్నారు. ప్రస్తుతం చర్ల ఏరియా కమిటీలో పార్టీ మెంబర్గా ప్రతి మెంబర్ గా పనిచేస్తుందని 2019 నుండి ఇప్పటి వరకు సుమారు రెండు నేరాలు ఏవోబీ పరిధిలో గల వివిధ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి అన్నారు.

2021 సంవత్సరం లో ఏప్రిల్ నెలలో జీరంగూడ గ్రామంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పాల్గొనిదని తెలిపారు. ఈ ఘటనలో 22 మంది పోలీసులు ముగ్గురు మావోయిస్టులు మరణించారు అని తెలిపారు. లొంగిపోవడానికి గల కారణాలు తెలుపుతూ ప్రజల నుండి పార్టీకి సహాయ సహకారాలు లేకపోవడం. నుండి వ్యతిరేకత రావడం, మావోయిస్టులు తమ పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వడం. కొత్తగా రిక్రూట్మెంట్ లేకపోవడం ఇటీవల తన తల్లి అనారోగ్యంతో మరణించడంతో తన కుటుంబ సభ్యులతో సాధారణ జీవితం గడపడం కోసం లొంగిపోయినట్లు తెలిపింది.

ప్రభుత్వ మరియు పోలీసు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు గిరిజన గ్రామాల్లో జరుగుతున్న, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై లొంగిపోవడం జరిగిందన్నారు. తక్షణ సాయంగా ఆయన పది వేల రూపాయలను, బియ్యం నిత్య సర వస్తువులు అందజేశారు.

ప్రభుత్వం నుండి కూడా లక్ష రూపాయల వరకు సాయం అందుతుందని, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు. క్షణికావేశంలో ఆకర్షితులైన వారు అజ్ఞాతవాసం వీడాలని జన జీవన స్రవంతిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

కోట్ల సంపద ఉన్నా.. ఆర్థిక సంక్షోభంలో అనంత పద్మనాభస్వామి

Sub Editor

లాయల్టీ బోనస్: కడప జడ్పీ చైర్మన్ గా ఆకేపాటి అమర్ నాధ రెడ్డి

Satyam NEWS

75లక్షల నగదు పట్టివేత

Sub Editor 2

Leave a Comment