42.2 C
Hyderabad
May 3, 2024 15: 38 PM
Slider ప్రత్యేకం

Women power: ఇక్కడ ఉన్నత స్థానాల్లో ఉన్నదంతా మహిళలే

#womenpower

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా స‌త్యం న్యూస్.నెట్ ప్ర‌త్యేక క‌థ‌నం

యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా – స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు…యావ‌త్ ప్ర‌పంచంలో స్త్రీని గౌర‌వించే దేశం ఏదైనా ఉంటే అది భార‌త దేశ‌మే. ఓ పార్వ‌తి,ఓ సీత‌,ఓ ద్రౌప‌ది, ఓ మండోద‌రి ఇలా నాటి పురాణాల నుంచీ అలాగే  ఓ జిజియా భాయి..ఓ రాణీ రుద్ర‌మ‌దేవి,ఓ  ఝాన్సీ ల‌క్ష్మీ భాయి..ఇలా వీర వ‌నిత‌లు…ఇంక రాజ‌కీయాల‌లో ఓ స‌రోజనీ నాయుడు, ఓ  ఉమాభార‌తి, ఓ సుష్మా స్వ‌రాజ్,  ఇలా  ప్ర‌తీ స్త్రీ….నా అన్న భావ‌న వ‌దిలి…స‌మాజం కోసం దేశం కోసం అహ‌ర్నిశ‌లు ప‌ని చేస్తోంది.

ఆడ‌దంటే ఆధారం…స్త్రీ అంటే దిక్సూచి.  ఇలా అంతర్థాతీయ మ‌హిళా దినోత్స‌వం రోజైన మార్చి 8 న తల‌చుకుంటామే గాని…ప్ర‌తీ మ‌నిషి గ‌మ‌నంలోనూ..అడుగులోనూ..ఆలోచ‌న‌లోనూ..ప్ర‌తీ ఒక్కరికీ ఆడ‌దే ఆధారం. కాగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్స‌వం సంద‌ర్బంగా….ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో గ‌డ‌చిన  రెండేళ్ల నుంచీ మ‌హిళా అధికారుల‌కే  జిల్లా ప‌రిపాల‌న యంత్రాంగం న‌డుపుతున్నార‌నే చెప్పాలి.

ప్ర‌త్యేకించి ఈ ఏడాది…అటు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ క‌లెక్ట‌ర్ ,ఇటు చ‌ట్టాల‌కు అధిప‌తి పోలీస్ సూప‌రెంటెండెంట్  స్త్రీ  కావ‌డం విశేషం. జిల్లా క‌లెక్ట‌ర్ గా సూర్య‌కుమారీ,జిల్లా ఎస్పీగా ద‌పికా ఎం పాటిల్ ఇద్ద‌రూ గ‌తేడాదిలోనే ఇంచుమించుగా తేడాతో జల్లా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

వాళ్లిద్ద‌రితో పాటు దాదాపు  15 ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు చెందిన జిల్లా అధికారులంతా మ‌హిళ‌లే కావ‌డం మ‌రింత విశేషం. గ‌తేడాది కరోనా మూలంగా కేవ‌లం ర‌న్  మాత్ర‌మే నిర్వ‌హించిన జిల్లా యంత్రాంగం..ఈ. ఏడాది…పోలీస్ శాఖ ఆద్వ‌ర్యంలో అటు పింక్ థాన్ ప‌రుగుతో పాటు అంతర్జాతీయ  మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా ఏకంగా స‌ద‌స్సునే నిర్వ‌హిస్తున్నారు..ఫ‌స్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.

క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ. న‌గ‌రంలోని ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియంలో ఆరోగ్య, ఆర్థిక, న్యాయ పరమైన అంశాలు, ఇతర సామాజిక అంశాలపై మహిళలకు అవగాహన సదస్సులు, వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళల స్వీయానుభవాలు వివరించడం, అలాగే మహిళలకు సత్కారం వంటి కార్యక్రమాలను నిర్వ‌హించేందుకు డీఆర్ డీఏ స‌మాయ‌త్తం మైంది..

అలాగేకనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి,  సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి… ఈ నేప‌ధ్యంలో  అంత‌ర్థాతీయ మ‌హిళాదినోత్స‌వం సంద‌ర్బంగా…ఓ మ‌హిళ నీకు శిర‌స్సు వంచి పాదాభివందనం చేస్తోంది..స‌త్యం న్యూస్.నెట్.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

విజయనగరం  జిల్లా అదనపు ఎస్పీగా అస్మా ఫర్హీన్

Satyam NEWS

భార్యాభర్తలను విడదీసిన క్వారీ లారీ

Satyam NEWS

ఎన్నికల సమయంలో వాలంటీర్ లను విధులనుండి తప్పించాలి

Bhavani

Leave a Comment