33.7 C
Hyderabad
April 29, 2024 02: 50 AM
Slider విజయనగరం

పెద్దాయన వద్ద లక్ష రూపాయల  బ్యాగ్ కొట్టేసిన కి”లేడీ”

#cctv

పక్కాగా రెక్కీ వేసి మరీ దొంగలించిన మహిళ… సీసీ పుటేజ్ విడుదల చేసిన పోలీసులు

విజయనగరం జిల్లా బొబ్బిలి లో పట్ట పగలే…హైదరాబాద్ లో మాదిరిగా ఓ వృధ్ధుని బ్యాగ్ ను…అదీ పక్కా ప్లాన్ తో రెక్కీ వేసి మరీ కొట్టేసింది….కి”లేడీ”. బొబ్బిలి లో పట్టపగలే…యూనిట్ బ్యాంక్ నుంచీ డబ్బులు డ్రా చేసుకుని ఇంటికెళ్లి మరీ…ఆ డబ్బుల సంచీని కొట్టేసింది.. ఓ మహిళ..ఈ మేరకు బొబ్బిలి సీఐ ఆచూకీ తెలపాలంటూ ఓ సీసీ పుటేజ్ ను విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే…. బొబ్బిలి లోని చీపురుపల్లి వీధిలో ఉన్ళ యూనియన్ బ్యాంక్ కు ఓ 88 ఏళ్ల వృద్ధుడు…తన అకౌంట్ నుంచీ సుమారు లక్ష వరకు డ్రా చేసుకున్నారు.

బ్యాంక్ లో పెద్దాయనను చూసి ఓ మహిళ తోడుంటానంటూ సాయ పడి…జాగ్రత్తగా రిక్షాలో పెద్దాయనను ఇంటి వరకు దిగబెట్టింది. ఇక ఆ పెద్దాయన హమ్మయ్య… అనుకునేలోపే…బ్యాంక్ లో డబ్బుల విడుదల చేయడం దగ్గర నుంచీ ఇంటి వరకు తనకు తోడుగా ఉండటం.. ఇదంతా తన వద్ద ఉన్న డబ్బులు కొట్టేయడానికి సదరు మహిళ వేసి రెక్కీ అని…ఇంట్లో కి చొరబడి డబ్బులు బ్యాగ్ కొట్టేసినంత వరకు తెలియరాలేదు. సీన్ కట్ చేస్తే సమాచారం అందుకున్న బొబ్బిలి పోలీసులు… సీసీ పుటేజ్ విడుదల చేసి….సదరు లేడీ కిలాడీ ఆచూకీ చెప్పాలంటూ కోరుతున్నారు. మీరు గాని ఈ లేడీ కిలాడీ ని చూస్తే… బొబ్బిలి పోలీసులను సంప్రదించాలని “సత్యం న్యూస్. నెట్” కోరుతోంది.

Related posts

అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటే ఎలా ప్రసన్నా?

Satyam NEWS

సెకండ్‌వేవ్ వచ్చేస్తున్నది బీ కేర్ పుల్ బ్రదర్స్

Satyam NEWS

ఆర్.సి.ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన కార్పొరేటర్ రజిత

Satyam NEWS

Leave a Comment