30.3 C
Hyderabad
March 15, 2025 10: 34 AM
Slider నల్గొండ

చికిత్స కోసం యువకునికి ఎల్ఓసి అందజేత

#MLA Chirumarthy Lingaiah

రోడ్లు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఎల్ఓసి చెక్కును ఆదివారం రోజున రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య, మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్నవెంకటరెడ్డి బాధితుని కుటుంబానికి అందజేశారు.

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం లోని చిట్యాల మున్సిపాలిటీ కి చెందిన ఎమ్ డి హర్షద్ ఇటీవల హైదరాబాద్ నుండి చిట్యాల కు వస్తుండగా మార్గ మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన ఎడమ కాలు పాదం పూర్తిగా ఛిద్రమైనది. వెంటనే అతన్ని హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

అతి బీద కుటుంబానికి చెందిన హర్షద్ కుటింబీకులు దిక్కుతోచని స్థితిలో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎమ్మెల్యే లింగయ్యను ఆశ్రయించారు.  వెంటనే ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధికి దరకాస్థూ చేయించగా రూ. 2 లక్షలు మంజూరై వచ్చాయి.

ఇట్టి చెక్కును హర్షద్ కుటుంబ సభ్యులకు సదరు ఎంపీ, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ నాయకులు పాటి మాధవరెడ్డి, ఎండి జమీరొద్దీన్, మెండే సైదులు, పొన్నం లక్ష్మయ్య, గుండెబోయిన సైదులు, బొబ్బల శివశంకర్ రెడ్డి, దాసరి నర్సిహ్మ, జిట్టా చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

హంటింగ్ కంటిన్యూస్: టిడిపి నాయకుడికి నోటీసులు

Satyam NEWS

మంత్రి ప్రారంభించాక..మళ్లీ ప్రారంభించడం ఏమి సంస్కారం?

Satyam NEWS

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

Satyam NEWS

Leave a Comment