35.2 C
Hyderabad
April 27, 2024 13: 54 PM
Slider నిజామాబాద్

వంటల దుకాణంలో ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీలు

#foodsafety

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇళ్ల కేంద్రంలోని 46 వ వార్డులోని కటిక సంఘం వద్ద గల శ్రీనివాస్ వంటల దుకాణంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిని శిరీష ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. వంటలు వండేటప్పుడు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్న ఫిర్యాదు మేరకు ఈ తనిఖీ నిర్వహించారు. వంటలు చేసే గదులు, వస్తువులను అధికారులు పరిశీలించారు. వంట చేసేటప్పుడు శుభ్రతను పాటించడం లేదని అధికారులు గుర్తించారు. వంటలకు ఉపయోగించే సామగ్రిని ఇష్టానుసారంగా ఉంచడంపై అధికారులు సీరియస్ అయ్యారు.

వంటల్లో వాడే మసాలా దినుసులు కవర్లలో ఓపెన్ గా ఉంచడం, ఆహార పదార్థాలు ఉంచే ప్రాంతంలో బల్లులు తిరగడాన్ని గమనించిన అధికారులు బల్లులు తినే పదార్థాల్లో పడితే ఎలా అని నిర్వహకుని ప్రశ్నించారు. ఎక్కడికక్కడ వస్తువులు పారవేయడంపై ప్రశ్నించిన అధికారికి ఈరోజే తీసుకొచ్చాం మేడమ్.. ఇప్పుడే తీసివేద్దాం అనుకున్నాం మేడమ్.. ఏ రోజుకారోజు మాత్రమే కావాల్సిన వస్తువులు తెస్తున్నాం మేడమ్ అంటూ అధికారులను నమ్మించే ప్రయత్నం చేశారు.

ఆహార పదార్థాల్లో వాడే కారం సాంపిల్ తీసుకున్నారు. నిర్వాహకుడు వంటలు చేపట్టే గదుల్లో అధికారులు తనిఖీలు చేపట్టగా ఒక గదికి అధికారులు ఇంకో గది నుంచి బయటకు వచ్చేలోపు తాళం వేసి తన వద్ద పనిచేసే వ్యక్తితో తాళం చెవి అక్కడినుంచి పంపించేశాడు నిర్వాహకుడు. అధికారులు సడెన్ గా రావడంతో నిర్వాహకుడు గాబరా పడటాన్ని గమనించిన అధికారులు తాళం వేసిన గదిని ఓపెన్ చేయించాల్సిందేనని పట్టుబట్టారు. సుమారు 20 నిమిషాల పాటు తాళం తీయకుండా అధికారులు వెళ్లిపోతారేమోనని నిర్వాహకుడు భావించినా అధికారులు అక్కడే ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాళం తీయడంతో అందులో ఉన్న అపరిశుభ్రత బయటపడింది.

దాంతో వంటలు చేసే గదిలో పరిశుభ్రత లేకపోవడంతో మున్సిపల్ సానిటరీ ఇన్ స్పెక్టర్ రవీందర్ నిర్వహకునికి 5 వేల ఫైన్ విధించారు. ఫుడ్ సేఫ్టీ అధికారిని శిరీష మాట్లాడుతూ.. సాంపిల్ తీసుకున్నామని, నివేదికలో కల్తీ అని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలో మున్సిపల్ సానిటరీ ఇన్ స్పెక్టర్ రవీందర్, ఇంచార్జి ఫుడ్ సేఫ్టీ అధికారిని సునీత పాల్గొన్నారు.

వంటల దుకాణాలు క్లోజ్

శ్రీనివాస్ వంటల దుకాణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపడుతున్న విషయం ఒక్కసారిగా బయటకు పొక్కింది. దాంతో అదే ఏరియాలో ఉన్న దుకాణాలన్ని అధికారులు వెళ్లిపోయేవరకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. గంట పాటు తనిఖీలు చేసిన అధికారులు వెళ్లిపోయిన అనంతరం మిగతా దుకాణాలు ఓపెన్ అయ్యాయి.

Related posts

ఒడిషాలో సీఎం కాన్వాయ్‌పై బిజేవైఎం కోడిగుడ్ల దాడి

Sub Editor

కరోనాపై పోరాటానికి కొమ్మూరి విరాళం రూ. లక్ష

Satyam NEWS

15 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీ ఉత్తర్వులు

Satyam NEWS

Leave a Comment