26.7 C
Hyderabad
May 3, 2024 08: 52 AM
Slider వరంగల్

జనాభా నియంత్రణ పాటిస్తేనే మానవ జాతికి మనుగడ

#mulugu

చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, ఒకరు లేదా ఇద్దరు పిల్లలకు కుటుంబ నియంత్రణ పాటించాలని సుఖ జీవనం గడపాలని ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం ను పురస్కరించుకుని ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ నిర్వహించింది.

ములుగు జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం ములుగు సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ పాటించు, ప్రగతికి నూతన అధ్యాయము లిఖించు అని పిలుపునిచ్చారు. ప్రపంచ మానవ జనాభా జూలై 11 1987న 500 కోట్లకు చేరిందని ఆయన గుర్తు చేశారు.

యుగస్లోవియా లో జన్మించిన మగ శిశువు మ్యారేజ్ గ్యాస్ సర్ జననాన్ని 500 కోట్ల జననంగా గుర్తించి. అప్పటినుండి ప్రతి సంవత్సరం జూలై 11ను ప్రపంచ జనాభా దినంగా జరుపుకుంటారని ఆయన తెలిపారు. 1800 సంవత్సరంలో ప్రపంచ మానవ జనాభా 100 కోట్లకు చేరుకుంది. అప్పటినుండి జనాభా పెరుగుతూ 2022 నాటికి 796 కోట్లకు చేరింది. జూలై 9, 2022 నాటికి అంచనా వేయబడిన భారతదేశ జనాభా 140 కోట్లు. అలాగే అంచనా వేయబడిన తెలంగాణ రాష్ట్ర జనాభా నాలుగు కోట్లు.

ప్రస్తుత చైనా జనాభా 145 కోట్లు, 2027లో భారతదేశ జనాభా చైనా జనాభాను అధిగమించి ప్రపంచంలో జనాభా విషయంలో మొదటి స్థానాన్ని ఆక్రమించనుంది. భారతదేశ భూ వైశాల్యం ప్రపంచ వైశాల్యంలో 2.4% మాత్రమే ఉంది. కానీ ప్రపంచ జనాభాలో 17.7% ప్రజలు ఈ దేశంలో నివసిస్తున్నారు.

1990లో సగటు ఆయుర్దాయం 64. 6 సంవత్సరం ఉండగా ప్రస్తుతం అది 72.6 సంవత్సరంలోకి పెరిగింది. 2050 నాటికి అది కాస్త 77.1 సంవత్సరంకి చేరవచ్చునని అంచనా వేస్తున్నారు 11 జులై 2022 జనాభా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రంలోని అందరూ ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు దంపతులకు కుటుంబ నియంత్రణ శాశ్వత మరియు తాత్కాలిక పద్ధతులపై అవగాహన కలిగించాలని ఆయన కోరారు.

వివాహ వయసుపై అవగాహన కల్పించండి

వివాహ వయస్సు, బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం, కుటుంబ నియంత్రణలో మగవారి భాగస్వామ్యం గురించి అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఎందుకంటే శాశ్వత కుటుంబాన్ని నియంత్రణలో స్త్రీలు 54.9% మంది పాటిస్తే పురుషుల్లో ఇది కేవలం ఒకటి పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఉంది.

పురుషుల్లో కోతకుట్టులేని నోస్కల్పల్ వ్యాసక్టమీకి ప్రోత్సహించాలి. జనాభా సమీకరణ పక్షోత్సవాలను జూన్ 27 నుండి జూలై 10వ తేదీ వరకు జనాభా స్థిరీకరణ పక్షోత్సవాలను జూలై 11 నుండి జూలై 24 తేదీ వరకు జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి రవీందర్, డెమో తిరుపతి, సిహెచ్ఓ దుర్గారావు, హెచ్ ఈ సంపత్, భాస్కర్, సూపర్వైజర్ సిబ్బంది యాకమ్మ, భూపాల్ రెడ్డి, సురేష్ మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మహారాష్ట్ర బిజెపి: వ్రతం చెడ్డినా కూడా ఫలితం దక్కలేదు

Satyam NEWS

నెగ్లిజెన్స్: గరుడ వారధికి గండి కొడుతున్న టీటీడీ

Satyam NEWS

వనపర్తి నాలుగవ వార్డులో ఉచిత మెగా వైద్య శిబిరం

Satyam NEWS

Leave a Comment