29.7 C
Hyderabad
May 3, 2024 04: 58 AM
Slider శ్రీకాకుళం

చిన్న కుటుంబం చింతలేని కుటుంబం

#srikakulam

చిన్న కుటుంబం చింతలులేని కుటుంబమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయని, ఆ దిశగా వైద్యులు, సిబ్బంది కృషిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.మీనాక్షి పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నిర్వహించిన ర్యాలీ అనంతరం స్థానిక వైద్య ఆరోగ్య శాఖధికారి కార్యాలయంలో వైద్యులు, సిబ్బందితో ఆమె సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు అనుకున్నంత స్థాయిలో జరగడం లేదన్నారు. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మినహా మిగిలిన చోట్ల జరగడం లేదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు ప్రోత్సహించడంలో ఉత్తమ సేవలు అందించిన వారికి నగదు పారితోషికం ఉంటుందని, అలాగే జిల్లాకు మంచి పేరు వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇకపై వైద్యులు, సిబ్బంది తమ పరిధిలో కుటుంబ నియంత్రణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వేసక్టమీ, ట్యూబెక్టమీలపై దృష్టిని సారించాలని, వేసక్టమీ ఆపరేషన్ చాలా సులభతరమని వివరించాలన్నారు. జిల్లాలోఅంతర ఇంజక్షన్లు అనుకున్నంతగా చేపట్టకపోవడం వలన నగదు పారితోషికం కోల్పోయామని, వచ్చే ఏడాదిలో తప్పక ఆ బహుమానం పొందేలా చర్యలు తీసుకోవాలని, పిపిఐవిసిడిలను కూడా పెంచాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

అనంతరం  కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించడంలో ఉత్తమ సేవలు అందించిన టెక్కలి పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యులు డా.జయలక్ష్మి, దూసి పి.హెచ్.సి వైద్యులు డా.పి.రేఖలకు ఒక్కొక్కరికి రూ.10వేలు వంతున,నరసన్నపేట, సారవకోట పి.హెచ్.సి సిబ్బంది అగర్త తేజ మరియు బి.భారతిలకు రూ.5వేలు వంతున ప్రోత్సాహక బహుమతితో పాటు సర్టిఫికేట్లను బహూకరించారు.

అలాగే శస్త్ర చికిత్సల విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన డిఎహెచ్ఓ కార్యాలయ డెప్యూటీ ఎస్.ఓ డి.శ్రీనివాస పట్నాయక్, పొన్నాడ,చాపర పి.హెచ్.సి వైద్యులు డా.ఎన్. శేషగిరి,డా.జి.గణపతి, జెమ్స్ మెడికల్ ఆఫీసర్ డా.పి.తార తదితరులకు జ్ఞాపికతో పాటు సర్టిఫికేట్లను బహూకరించారు.

అదేవిధంగా ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో విజేతలైన బొద్దాన దుర్గ, ఉరిటి సాయితేజ, బి.ఉన్నీషా, డి.ధనలక్ష్మి, ఇ.ఉషారాణి, సిహెచ్.నందిని, పి.రమ్య, లేఖ రాణి తదితరులకు ధ్రువీకరణ పత్రాలు,జ్ఞాపికలను బహూకరించారు.తొలుత ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీలో జె.సితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకట రమణ, డా.కె.కృష్ణమోహన్, డా.కె.అప్పారావు,డా.ఎన్. శేషగిరి, డా.జి.గణపతి,డా.పి.తార, మంత్రి వెంకటస్వామి, సోమేశ్వర రావు, కె.ఎల్.నారాయణరావు, సూర్యకళ, ఏ.ఎన్.ఎంలు, ఆశావర్కర్లు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ

Satyam NEWS

త‌ల్లుల ఖాతాల్లో 27.85 కోట్లు జ‌మ చేసిన సీఎం జగన్…!

Satyam NEWS

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం

Satyam NEWS

Leave a Comment