38.2 C
Hyderabad
April 29, 2024 19: 33 PM
Slider చిత్తూరు

నెగ్లిజెన్స్: గరుడ వారధికి గండి కొడుతున్న టీటీడీ

naveenkumar reddy

తిరుపతి పట్టణంలో చేపట్టిన గరుడ వారధి కి టీటీడీ నిధుల విడుదలలో ఎందుకు జాప్యం చేస్తున్నారని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగర ప్రజలతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం టిటిడి సహకారంతో నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ సమన్వయంతో 67:33 శాతం నిధులతో తిరుమల బైపాస్ రోడ్డు లో ప్రారంభించిన గరుడ వారధి ప్లైఓవర్ పనులకు 67% నిధులను విడుదల చేయడంలో టీటీడీ ధర్మకర్తల మండలి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

టీటీడీ లో శ్రీవారి నిధుల జమా ఖర్చుల పై సమగ్ర విచారణ జరిపించాలని, కాగ్ (కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ద్వారా ఆడిట్ జరిపిస్తే శ్రీవారి భక్తులు నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. ) టీటీడీ లోని కొంతమంది అధికారులు తమ కుర్చీలను కాపాడుకోవటానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

గరుడ వారధి ఫ్లైఓవర్ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, తిరుమలకు ప్రతి నిత్యం సుదూర ప్రాంతాల నుంచి సుమారు పది వేల వాహనాలు తిరుమల కొండకు వస్తున్నాయని దీనివల్ల తిరుపతిలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైందని ఆయన అన్నారు.

గరుడ వారధి పనులు సకాలంలో పూర్తయితే తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్య తీరుతుందని ఆయన చెప్పారు. గరుడ వారధి పనులలో పురోభివృద్ధి మందగించి నగర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. గరుడ వారధికి టీటీడీ నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదని, అదే తిరుమల బయట, వివిధ రాష్ట్రాల్లో అక్కడి వారి మెప్పు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.

టీటీడీ ఈవో కు ఉత్తరాది పై ఉన్న ప్రేమ దక్షిణాదిపై లేదని ఆయన ఆరోపించారు. తిరుమలకు 3 వ సారి ఉన్నత అధికారిగా వచ్చిన ధర్మారెడ్డి శ్రీవాణి ట్రస్ట్ పెట్టి 10 వేలకు బ్రేక్ దర్శనం టికెట్లు అమ్ముతున్నారు, 100 రోజుల్లో 45 కోట్లు వచ్చింది అని గొప్పలు చెప్పుకుంటూ రాష్ట్రమంతా దేవాలయాలు కడతామని చెబుతున్నారే తప్ప టిటిడి ఆర్థిక పరిస్థితిని పట్టించుకోవడం లేదని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.

Related posts

బి ఆర్ ఎస్ పార్టీని ఓడించాలి

Satyam NEWS

మారుతున్న లెక్కలు: సీఎం జగన్ ప్లాన్ ‘బి’

Satyam NEWS

ఖ‌మ్మంలో టీఆర్ఎస్ కు భారీ షాక్‌

Satyam NEWS

Leave a Comment