28.7 C
Hyderabad
April 28, 2024 03: 26 AM
Slider ముఖ్యంశాలు

జంపన్న వాగు వరద బాధితులకు సీతక్క సాయం

#mlaseetakka

గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలతో పాటు ఇండ్లు పూర్తి స్థాయిలో వరద ఉధృతికి గురైనాయని, రాష్ట్ర ప్రభుత్వం జరిగిన నష్టాన్ని అంచనా వేసి పేద ప్రజలను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జంపన్న వాగు వద్ద వరద ఉదృతికి గురైన 25  కుటుంబాలను ఆమె నేడు పరామర్శించి నిత్యావసర సరుకులు పప్పు, నూనె, బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. భారీ వర్షాలు పడుతున్నందున వరద ఉద్ధృతి, రాబోవు 24 గంటల్లో పడే వర్షాల వల్ల  ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను కోరారు.

భారీ వర్షాలు పడుతున్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి ప్రాణనష్టం జరగకుండా చూడాలని సీతక్క కోరారు. అధికారులు గ్రామాలలోని ప్రజాప్రతినిధుల సమన్వయంతో చెరువులు, వాగుల, ప్రాజెక్టుల నీటి నిలువల గురించి ఎప్పటికప్పుడు  సమాచారాన్ని సేకరించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీతక్క కోరారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు ఉన్నందున  గ్రామాలలో పాత ఇండ్లు, గుడిశ లలో, శిథిలావస్థలో  ఉండే నివాసలలో ఉండే  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే నది తీరా గ్రామాలలో పెద్దలు తమ పిల్లలను నదులలోకి,వాగుల వద్దకి వెళ్లకుండా చూడాలని సీతక్క సూచించారు. వాగులు వంకలలో కూడా నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో అప్రమతంగా ఉండాలని అన్నారు.

భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో ఉన్న వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని  ఆదేశించారు. వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్లు, గ్రామాలు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో వుంటూ.. ఎటువంటి ఆటంకాలు కలగకుండా  ఎక్కడైనా వరద ఉధృతో రోడ్లు తెగిపోయిన, ఉదృతంగా ప్రవహించేనా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లవద్దని,  ప్రమాదాల భారీన పడకుండా ప్రాణనష్టం జరగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాబోవు రెండు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజల అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని ప్రజలకు  సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాలపు అనంత రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మాజీ జెడ్పీటీసీ బోళ్లు దేవేందర్,సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్, జిల్లా నాయకులు లచ్చు పటేల్, ముదర కోళ్ల తిరుపతి ములుగు ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,మాజీ ఎంపీటీసీ బత్తిని రాజు,తండాల శ్రీను,ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పిరిల వెంకన్న,సర్పంచ్ ఇర్ప సునీల్ సహకార సంఘం డైరెక్టర్ రాజేందర్,యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ మొక్క శ్రీను, గండ్రత్ విజయకర్,తాలూకా సంపత్, ఎనుగంటి నరేష్,రవి కుమార్, కలువల సమ్మయ్య, సంకే శ్రవణ్,బొప్ప వినోద్,కోడి నర్సింహులు,కాకసారయ్య, వట్టం సమ్మయ్య, గూడూరు సమ్మీ రెడ్డి, చర్ప నేతాజీ,సిద్ధ బోయిన రమేష్,అట్టం రమేష్, రామస్వామి,నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజ్ న్యూస్ రిపోర్ట‌ర్ కుటుంబానికి చెక్ పంపిణీ….!

Satyam NEWS

చైత్ర హత్య ఘటనపై బహుజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

Satyam NEWS

బిజెపి పాలనపై పీడత ప్రజలు పోరాడాల్సిన సమయం ఇది

Satyam NEWS

Leave a Comment