38.2 C
Hyderabad
April 29, 2024 11: 41 AM
Slider సినిమా

సూపర్ స్టార్ కృష్ణ మృతి వార్త పై దిగ్భ్రాంతి

అల్లూరి సీతారామరాజు నటనతో తనలోనే కాక యావత్ ప్రపంచానికే తన నటనా కౌశలాన్ని…భావోద్వేగాలను..భరతజాతికి అంకితమయ్యే విధానాన్ని తన నటనతో యాభై ఏళ్ల క్రితమే చూపించిన సూపర్ స్టార్ కృష్ణ మృతిని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు.ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చెప్పారు.

ప్రముఖ సినీ హీరో, నిర్మాత, దర్శకుడు కృష్ణ (ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి) గ నేడు మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందన్నారు.కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావుతో నిన్నటి రోజున ఫోన్లో మాట్లాడడం జరిగిందని…తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇంతలోపే కృష్ణ గారు మరణించారన్న వార్త విషయం తెలిసి తీవ్ర దిగ్బ్రాంతి చెందానని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నారు.

అనేక తెలుగు చిత్రాలలో సమాజాన్ని తట్టి లేపే విధంగా, ప్రజలను చైతన్యం చేసే ఎన్నో చిత్రాలలో హీరో కృష్ణ గారు నటించి జీవించారన్నారు. వారు సినిమాల్లో నటిస్తున్నప్పుడు ప్రజలకు, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎదిరించే మనస్తత్వాన్ని రేకెత్తించారని తెలిపారు.వారు నటించినటువంటి చిత్రాలన్నీ సమాజాన్ని తన్యం చేసే చిత్రాలేనని.. స్వతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు ఒక ప్రముఖమైన పోరాటం అలాంటి పోరాటాన్ని తన నటన ద్వారా అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటాన్ని ప్రజలకు తెలియజేసిన వ్యక్తి హీరో కృష్ణ గారు… ఏ పాత్ర పోషించిన ఆ వర్గం తమ నాయకుడిగా తమ మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న విశిష్టమైన నటుడు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ, తెలుగు ప్రజలు గొప్ప సినీ నటుడిని కోల్పోయిందన్నారు. వారి మరణం తెలుగు ప్రజలకు, సినిమా పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు.

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని విషాద హృదయం తో మాట్లాడారు.

Related posts

పెరిగిన పెట్రోల్, డీజిల్ చార్జీలతో ఆటో డ్రైవర్లకు తీరని నష్టం

Satyam NEWS

బత్తాయి, నిమ్మ ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

Satyam NEWS

50 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సత్వర చర్యలు

Satyam NEWS

Leave a Comment