27.7 C
Hyderabad
May 4, 2024 08: 43 AM
Slider ప్రత్యేకం

మత్స్య కార అభ్యున్నతి సభను విజయవంతం చేయండి: పాలవలస యశస్వి

#janasena

రాష్ట్రంలో మత్స్యకారులను వైస్సార్సీపీ ప్రభుత్వం గాలికి వదిలేసి వారి కుటుంబాలను రోడ్డున పడేసిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి మండిపడ్డారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జనసేన మత్స్యకార వికాస విభాగంలో కార్యదర్శలుగా నియమితులైన  గనగల్ల రాజు,కర్రీ అప్పలరాజు ను ఆమె సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 20వ తేదీన నరసాపురం లో వారికి మద్దతుగా భారీసభను పెడుతున్నారని చెప్పారు.

ఇప్పటికే ప్రభుత్వం మత్స్యకారులకు బడ్జెట్ కేటాయింపుల్లో గాని, ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలకు ఇస్తామన్న పదిలక్షల రూపాయలు ఇవ్వట్లేదని ఆరోపించారు. చేపలవేటకు అధునాతన మైన బోట్లు,కనీసం వలలు గాని అందివ్వడంలేదని, కనీసం చదువుకున్న మత్స్యకారుల యువతీయువకులకు ఉపాధి కల్పనగాని, రుణాలను గాని సమకూర్చట్లేదని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

ఈ క్రమంలో నే మత్స్యకారుల సమస్యలపై ఈనెల20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తెలిపేందుకు పవన్ కళ్యాణ్ గళమెత్తనున్నారని చెప్పారు. ఆ సభకు భారీఎత్తున మత్స్యకారులు, ప్రజలు,జనసైనీకులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ అభ్యున్నతి సభకు మద్దతు గా 18వ తేదిన జిల్లా లోని సముద్రతీరప్రాంతాల్లో ఉండే మత్స్యకారులు ఉండేప్రాంతాల్లో  పార్టీ మత్స్యకార వికాస విభాగం నాయకులతో పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.

అలాగే మత్స్యకార వికాస విభాగం కార్యవర్గ సభ్యులుగా నియమితులైన గనగల్ల రాజు,కర్రీ అప్పలరాజు లకు మత్స్యకారుల సంక్షేమానికి, వారి అభ్యున్నతికి కృషిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు తుమ్మి లక్ష్మీ రాజ్,జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు),లాలిశెట్టి రవితేజ, జనసేన కార్పొరేటర్ అభ్యర్థి దాసరి యోగేష్,మిడతాన రవికుమార్,మైలపల్లి ఎల్లాజి, సాయి పాల్గొన్నారు.

Related posts

రైతే రాజు అన్న మాటను నిజం చేద్దాం

Satyam NEWS

ఘనంగా  అయ్యప్ప మహా పడిపూజ

Satyam NEWS

ఓయూ పీఎస్ లో తాడూరి శ్రీనివాస్ పై ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment