40.2 C
Hyderabad
May 2, 2024 17: 57 PM
Slider గుంటూరు

ప్రతిష్టాత్మకంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళు

#kotappakona

మహాశివరాత్రి సందర్భంగా మార్చి 1న జరగనున్న కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళను పురస్కరించుకొని జరుగుతున్న అభివృద్ధి పనులను గుంటూరు జిల్లా నరసరావుపేటు శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేడు పరిశీలించారు. నరసరావుపేట డీఎస్పీ విజయ భాస్కర్ రావు, ఎమ్ఆర్వో రమణా నాయక్, ఆలయ ఈవో రామ కోటిరెడ్డితో కలిసి పమిడిమర్రు, గురవాయపాలెం, కొండకావూరు, గిరిప్రదక్షిణ రోడ్లను పరిశీలించారు.

యలమంద, గురవాయ పాలెం వద్ద నిర్మితమవుతున్న బ్రిడ్జి, ట్రాఫిక్ డైవర్షన్, సెంట్రల్ లైటింగ్, గిరి ప్రదక్షణ రోడ్లను ఆయన పరిశీలించారు. కొండ పై నిర్మితమవుతున్న అన్నదాన సత్రం, డార్మెటరీ, నంది విగ్రహం, కొండ అంతా ప్రతిధ్వనించేలా ఓం నమఃశివాయ ప్రవచనం, పాత కోటయ్య స్వామి సన్నిధిలో వరకు సోలార్ లైటింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన పనులన్నీ కూడా ఈ నెల 25 నాటికి పూర్తి అవుతాయి అని ధీమా వ్యక్తం చేశారు.

తిరునాళ్ళకు వచ్చే భక్తులు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా స్వామిని దర్శించుకునేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. గతంలో కంటే ఎక్కువ మంది స్వామిని దర్శించుకునే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా క్యూ లైన్లు ఏర్పాటు.. భక్తులకు మంచినీరు, బిస్కట్లు, మంచి నీరు, పాలు అందించేలా 550 మందితో క్యూ లైన్ ల వద్ద అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు అనే వారికి కోటప్పకొండ అభివృద్ధి ప్రత్యక్ష నిదర్శనం అన్నారు. పల్నాడు జిల్లాగా ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి తిరునాళ్ళను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నమన్నారు. వచ్చిన భక్తులందరూ స్వచ్ఛ్ కోటప్పకొండ ను దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వస్తువులు వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్ బిన్లు వినియోగించుకుని కొండ అంతా శుభ్రంగా ఉండేలా చూడాలనీ.. దానికి అందరూ సహకరించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చిట్టిబాబు, ఎంపీపీ మూరబోయిన శ్రీనివాస రావు, కొండ కావూరు సర్పంచ్ నాగిరెడ్డి, బసికాపురం సర్పంచ్ రాజేష్, ఉప్పలపాడు సర్పంచ్ దేసింగ రావు, ముక్కు వెంకటేశ్వర రెడ్డి, మట్ల లింగారెడ్డి, రొంపిచర్ల మండల కన్వనర్ పచ్చవ రవీంద్ర బాబు, యలమంద నాయకులు బొబ్బల నాగార్జున, పమిడిమర్రు, గురవాయపాలెం, కొండకావూరు గ్రామాల నాయకులు, నరసరావుపేట పట్టణ నాయకులు సానికొమ్ము కోటి రెడ్డి, కందుల ఎజ్రా, మనోహర్ యాదవ్, తలారి నాని, క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ చింతా కిరణ్ కుమార్, పాలపర్తి వెంకటేశ్వర్లు, శ్యామల శ్రీనివాస రెడ్డి, గాబ్రియేలు, ఇతరులు పాల్గొన్నారు.

Related posts

నిన్నటి వరకూ బిర్యానీ పంచిన చేతులు నేడు కరోనా…

Satyam NEWS

యూనియన్ బంక్ లో అగ్నిప్రమాదం

Sub Editor 2

పోలీసుల‌కూ వారి కుటుంబాల‌ కోసం ప్ర‌త్యేక ఐసొలేష‌న్ వార్డు

Satyam NEWS

Leave a Comment