2024లో బిజెపి 350 సీట్లు పైన గెలవనున్నది మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారంనాడు సత్యసాయి జిల్లా పుట్టపర్తి లో విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ. రాబోయే ఎన్నికల్లో బిజెపి ఆంధ్ర రాష్ట్ర క్రియాశీలక రాజకీయ పార్టీగా ఆవిర్భావం చెందబోతుంది అని అన్నారు. అదే విధంగా 2024 లో వైసీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదు. ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు అన్న నమ్మకంతోనే సీఎం వారిని మారుస్తున్నారు అని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
బిజెపి పై ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడింది అనడానికి నిదర్శనం జరిగిన ఎలక్షన్లే తెలంగాణలో అనూహ్యమైన ఓటు శాతం పెరిగింది. వికాసి భారత్ అన్నది దేశవ్యాప్తంగా ప్రజలకు పలు సేవలు అందించడానికి అవగాహన కల్పించడానికి చేపట్టిన యాత్ర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ నిర్లక్ష్యం చేస్తుంది. అధికారులు ఐఏఎస్ అధికారులు అయ్యా ఎస్ పద్దతులలో కొందరు ప్రవర్తిస్తున్నారు. వీటి పైన త్వరలోనే గవర్నర్ కి ఫిర్యాదు చేయబోతున్నాం అని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు వినియోగం చేసుకుని రాష్ట్ర ప్రజలకు చేరవేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమవుతున్నదని ఆయన తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో కుటుంబ పాలన వారసత్వ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. జనసేన బిజెపి తెలంగాణలో కలిసి పోటీ చేశాయి ఆంధ్రాలో కూడా అదే జరుగుతుంది. మేము సీట్లు ఇచ్చే వాళ్ళమే తప్ప తీసుకునే వాళ్ళం కాదు. గత 4 సంవత్సరాల్లో అన్ని ఎన్నికలలో బిజెపి గట్టి పోటీగా నిలబడుతూ వస్తోంది. పెద్ద పార్టీలు అంటూ చెప్పుకుంటున్న పార్టీలు సైతం ఎన్నికలలో తమ అభ్యర్థులను నిలుపుకోవడంలో విఫలమయ్యాయి. బిజెపి ఆంధ్రలో ఎదుగుతున్న దానికి నిదర్శనం ఇంతకన్నా ఏం కావాలి అని ఆయన ప్రశ్నించారు. మునిగిపోయి రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని కొన్ని పార్టీలు స్వార్థంతో లేపాలని చూస్తున్నారు. అది వాళ్లకు రాజకీయ ఆత్మహత్య సదృశ్యమే. ఆ పార్టీలకు బీజేపీ పార్టీ భవిష్యత్ లో సరైన సమాధానం చెబుతుంది అని ఆయన అన్నారు.