37.2 C
Hyderabad
April 30, 2024 11: 57 AM
Slider నెల్లూరు

వైసీపీ ఎమ్మెల్యే మేకపాటికి వారసుడి బహిరంగ లేఖ..!!

#mekapati

ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పెద్ద వివాదంలో చిక్కున్నారు. తనను కొడుకుగా ఒప్పుకోవాలంటూ చంద్రశేఖర్ రెడ్డికి మేకపాటి శివచరణ్ రెడ్డి రాసిన బహిరంగ లేఖ కలకలం రేపుతోంది. ఈ లేఖ, పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమను 18 ఏళ్ల పాటు రహస్యంగా ఉంచి వదిలిపెట్టావని లేఖలో శివచరణ్ రెడ్డి అన్నారు. తనకు కుమారుడే లేడని మేకపాటి ఇటీవల చెప్పారు. ఈ వ్యాఖ్యలపై బహిరంగంగా శివచరణ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశాడు. నీకు కొడుకు లేకపోతే… నేను ఎవరిని? అని ప్రశ్నించాడు. తనను కొడుకుగా ఒప్పుకోవాలని డిమాండ్ చేశాడు.

చదువుకు ఫీజులు చెల్లిస్తే నీ బాధ్యత తీరిపోతుందా? అని శివచరణ్ రెడ్డి ప్రశ్నించాడు. తన తల్లి తర్వాత పరిచయమైన ఆమెను భార్యగా సమాజానికి పరిచయం చేశావని శివచరణ్ రెడ్డి మండిపడ్డాడు. ఈ లేఖతో పాటు, పాత ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లేఖపై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇంకా స్పందించలేదు. ఈ వ్యవహారం మేకపాటి కుటుంబంతో పాటు, వైసీపీలో కూడా కలకలం రేపుతోంది.

Related posts

అధికారుల వైఖరిపై కరెంటు స్తంభం ఎక్కి నిరసన

Satyam NEWS

ప్రతి ఒక్కరూ అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలి

Satyam NEWS

ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద రాణిరుద్రమ నిరసన

Satyam NEWS

Leave a Comment