27.7 C
Hyderabad
April 30, 2024 10: 50 AM
Slider కర్నూలు

ఉగ్రవాదులకు అండగా ఉంటున్న వైసీపీ నేతలు

#vishnuvardhanreddy

డెప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి ,హఫీజ్ ఖాన్ వంటి వారు ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తున్నారని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి ఆరోపించారు. ఆత్మకూరు పోలీస్ స్టేషను తగులబెట్టిన వాళ్లపై కేసులు పెట్టొద్దని అధికార పార్టీ నేతలు ఒత్తిడి పెట్టారని ఆయన అన్నారు. గుంటూరు, రాయచోటి , ఆత్మకూరు పోలీస్ స్టేషన్లను తగుల పెట్టిన వారిని అధికార పార్టీ నేతలు కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు.

దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు చేస్తూ వందలాది మంది ఉగ్రవులను అరెస్టు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో వారిని కాపాడే చర్యలకు పాల్పడటం తీవ్రమైన నేరమని ఆయన అన్నారు. పీఎఫ్ఐ, ఎస్డీపీఐ పార్టీలు వైసీపీ మిత్రపక్షాలా..? అని ఆయన ప్రశ్నించారు. పీఎఫ్ఐ, ఎస్డీపీఐ ప్రతినిధులపై ఉన్న కేసులను ఈ ప్రభుత్వం రద్దు చేస్తుందా..? జైళ్ల నుంచి విడుదలైన పీఎఫ్ఐ, ఎస్డీపీఐ ప్రతినిధులతో కలిసి ర్యాలీలు చేస్తారా..? ఉగ్రవాద సంస్థలైన పీఎఫ్ఐ, ఎస్డీపీఐ ప్రతినిధులతో గతంలో హోం మంత్రిగా ఉన్న సుచరిత చర్చలు జరుపుతారా..? అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పీఎఫ్ఐ, ఎస్డీపీఐ సంస్థలకు షెల్టర్ జోన్లుగా తయారయ్యాయని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఉగ్రవాద సంస్థల కదలికల విషయంలో  తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయని ఆయన అన్నారు. పీఎఫ్ఐ, ఎస్డీపీఐ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువయ్యాయని, ఈ రెండు ఉగ్రవాద సంస్థలపై జాతీయ భద్రతా సంస్థలు నిఘా పెడుతున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. అధికార పార్టీ ఉప ముఖ్యమంత్రి కొందరు నేతలు పీఎఫ్ఐ, ఎస్డీపీఐ ఉగ్రవాదులకు అండగా ఉంటున్నారంటూ బీజేపీ విష్ణువర్దన్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు.

Related posts

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన లారీ డ్రైవర్

Satyam NEWS

పేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

జాతీయ బీసి సంక్షేమ సంఘం ములుగు జిల్లా కన్వీనర్ గా సంద బాబు

Satyam NEWS

Leave a Comment